Breaking News

‘చంద్రబాబు ఎప్పుడు చెయ్యిస్తారో చెప్పలేం’

Published on Tue, 01/14/2025 - 12:54

గత రెండు  సార్వత్రి ఎన్నికల్లో 280 ఫ్లస్‌ సీట్లతో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగే స్థాయి నుంచి.. 2024 ఎన్నికల్లో 240 సీట్లకు పడిపోయి మిత్రపక్షాల మీద ఆధారపడే స్థాయికి చేరుకుంది బీజేపీ. అయితే కింగ్‌మేకర్లుగా తమ తమ రాష్ట్రాలకు కావాల్సింది సాధించుకోవడంలో ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌లు విఫలమవుతున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో..   

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీశ్ కుమార్‌లు ఎన్డీయే కూటమికి ఎప్పుడు హ్యాండిస్తారో ఎవరూ ఊహించలేరని వ్యాఖ్యానించారు. సోమవారం ఇందిరాగాంధీ పంచాయితీ రాజ్‌భవన్‌లో లోక్‌స్వరాజ్‌ మంచ్‌  నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..

‘‘400 సీట్లు సాధిస్తామని ఒకప్పుడు ప్రగల్భాలు పలికిన వారు ఇప్పుడు 240 సీట్లకే పరిమితమయ్యారు(పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ..). చంద్రబాబు ఎప్పుడు మనసు మార్చుకుంటారో తెలియదు. నితీశ్‌ కుమార్‌ ఎప్పుడు  తన మద్దతు వెనక్కి తీసుకుంటారో తెలియదు.  ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతమని భావించకూడదు.. 

.. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మంచీచెడులు ఉంటాయి. కీర్తి అనేది తాత్కాలికం. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన నిలిచిన వారే, ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకుని శాశ్వతంగా గుర్తుండిపోతారు అని అన్నారాయన. అలాగే ఇండియా కూటమి మధ్య బీటల అంశంపై  ప్రస్తావిస్తూ.. లోక్‌సభ ఎన్నికలు ఇంకా నాలుగేళ్ల దూరంలో ఉన్నాయని, ఈలోపు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీయే కూటమిలో బీజేపీ(240) తర్వాత టీడీపీ 16 స్థానాలు, జనతాదళ్ (యూ) 12, అతిపెద్ద పార్టీలుగా ఉన్నాయి. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)