Breaking News

పీఎం మోదీ డిగ్రీ వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

Published on Mon, 08/25/2025 - 17:27

న్యూఢిల్లీ:  ఎన్నో ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివాదం అంశానికి సంబంధించి తనిఖీకి అనుమతిస్తూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది.  ప్రధాని మోదీ విద్యకు సంబంధించిన రికార్డులను బహిరంగ పర్చాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. 

ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై గత కొన్ని సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది.  1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి నరేంద్ర మోదీ.. బీఏ డిగ్రీ పూర్తి చేశారని చెబుతున్న నేపథ్యంలో, ఆ డిగ్రీ వివరాలను బహిర్గతం చేయాలన్న డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే  2016లో కేంద్ర సమాచార కమిషన్.. మోదీ డిగ్రీ రికార్డులను తనిఖీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

అయితే ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ యూనివర్సిటీ. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) సీఐసీ ఆదేశాలను కొట్టేసింది. వ్యక్తిగత గోప్యత హక్కు అనేది తెలుసుకునే హక్కు కంటే మిన్న అని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. యూనివర్సిటీ విద్యార్థుల రికార్డులు,.. ఆర్టీఐ చట్టం కింద బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని తేల్చింది.

మోదీ డిగ్రీ వివరాలను కోర్టుకు అందించేందుకు యూనివర్సిటీ సిద్ధంగా ఉన్నా, అవి అపరిచితులతో పంచుకోవడం గోప్యత ఉల్లంఘన అవుతుందని ఢిల్లీ యూనివర్శిటీ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు.. సీఐసీ ఆదేశాలను నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. తాజా హైకోర్టు తీర్పుతో ఇప్పటి వరకూ మోదీ డీగ్రీ వివాదంపై జరుగుతున్న రాజకీయ వివాదానికి దాదాపు ముగింపు దొరికినట్లే కనబడుతోంది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)