భార్య ప్రసవం కోసం వచ్చి

Published on Mon, 05/12/2025 - 09:40

యశవంతపుర(కర్ణాటక): ఎంతో కాలం కుటుంబాలకు దూరంగా ఉంటూ సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశప్రజల ప్రాణాలు కాపాడుతున్న జవాన్లు సెలవుల్లో ఇళ్లకు వచ్చారు. అయితే అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ నుంచి పిలుపురావడంతో ఉన్నఫళంగా తిరుగు ప్రయాణం అవుతున్నారు.  చెల్లెలు పెళ్లి కోసం వచ్చిన జవాన్‌కు ఆర్మీ అధికారుల నుంచి అత్యవరసమైన పిలుపు రావటంతో కుటుంబసభ్యులు జవాన్‌కు సింధూరం దిద్ది విధులకు పంపించారు. ఈ ఘటన బీదర్‌లో చోటు చేసుకుంది. బీదర్‌ జిల్లా భాల్కీ తాలూకా చందాపుర గ్రామానికి చెందిన  బసవకిరణ బీరుదార పంజాబ్‌ అమృత్‌సర్‌లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 

ఏప్రిల్‌ 27న చెల్లెలు పెళ్లి కారణంగా సెలవుపై   చందాపుర వచ్చాడు. ప్రస్తుతం భారత్‌–పాక్‌ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న కారణంగా సెలవులు రద్దు చేసుకొని విధులకు రావాలని ఆర్మీ అధికారులు అత్యవసరమైన సందేశం పంపారు. దీంతో చందాపుర గ్రామస్తులు జవాన్‌ బసవకిరణకు సింధూర తిలకరం దిద్ది, హారతి పట్టి  విధులకు సాగనంపారు. భారత సైన్యంలో పని చేస్తున్న జవాన్లకు అక్కా చెల్లెళ్ల అశీర్వాదం ఉంటుందని బసవకిరణ చెల్లెలు వచనశ్రీ తెలిపారు. మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసి హతం చేయటం విజయంగా భావిస్తున్నట్లు వచనశ్రీ సంతోషం వ్యక్తం చేశారు. 

భార్య ప్రసవం కోసం వచ్చి 
భార్య ప్రసవం కోసం స్వగ్రామానికి వచ్చిన జవాన్‌ ఉన్నత అధికారుల ఆదేశాలతో తిరిగి విధులకు వెళ్లాడు. కలబురిగికి చెందిన హనమంతరాయ సీఆర్‌పీఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. భార్య  స్నేహ ప్రసవం తేదీ దగ్గర పడటంతో ఏడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. భార్య పండంటి బిడ్డకు జన్మ ఇచ్చింది. ఈ సంతోషంలో ఉండగానే  కశీ్మరు నుంచి పిలుపు వచ్చింది. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో వెంటనే విధులకు రావాలని చెప్పారు. దీంతో బాలింతగా ఉన్న భార్య, ఏడు రోజుల నవజాత శిశువునుంచి వీడ్కోలు తీసుకొని దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దేశసరిహద్దులకు బయల్దేరి వెళ్లాడు. స్నేహితులు, బంధువులు బరువైన హృదయాలతో వీడ్కోలు పలికారు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)