‘ఇక సీఎం మార్పు క్వశ్చనే లేదు’

Published on Thu, 12/11/2025 - 14:01

బెంగళూరు: గత కొన్ని రోజులుగా కర్ణాటకలో కొనసాగుతున్న సీఎం మార్పు సంక్షోభానికి తెరపడినట్లే కనబడుతోంది.  సిద్ధరామయ్యనే మిగతా రెండున్నరేళ్లు కొనసాగాలని హైకమాండ్‌ చెప్పిందని ఆయన తనయుడు, ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య స్పష్టం చేశారు.  ఈరోజు(గురువారం, డిసెంబర్‌ 11వ తేదీ) యతీంద్ర మాట్లాడుతూ.. ‘ ఇది క్లియర్‌. మిగతా రెండున్నరేళ్లు మా నాన్నే సీఎంగా కొనసాగుతార.  కాంగ్రెస్‌ అధిష్టానం ఇదే విషయాన్ని చెప్పింది. 

ఇక నాయకత్వ మార్పు ప్రశ్నే ఉండదు. ఫలితంగా సీఎం మార్పు వివాదానికి తెరపడింది’ అని పేర్కొన్నారు. ఇక గత సోమవారం సీఎం సిద్ధరామయ్య ఇదే అంశంపై మాట్లాడుతూ.. హైకమాండ్‌ ఎలా చెబితే అలా అని వ్యాఖ్యానించారు.  అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఇదే విషయంపై తనతో పాటు డీకే శివకుమార్‌ కూడా అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తారన్నారు. 

కర్ణాటక సీఎం మార్పు అంశానికి సంబంధించి ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు చోట చేసుకున్నాయి.  సిద్ధరామయ్య-డీకే శివకుమార్‌ల మధ్య  మాటల వివాదం మొదలుకొని రెండు బ్రేక్‌ ఫాస్ట్‌ల ఎపిసోడ్‌ల వరకూ వెళ్లింది. కర్ణాటక సీఎం పదవిని సిద్ధరామయ్య గతంలో చేపట్టే క్రమంలో ఒప్పందం జరిగిన నేపథ్యంలో డీకే శివకుమార్‌ తనకు సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టారు., అయితే సిద్ధరామయ్య ఈ రెండున్నరేళ్లు తనకే ఉంచాలని డీకేతో పాటు అధిష్టానాన్ని కూడా కోరారు. ఇలా వారి మధ్య పంచాయతీ నడుస్తూ వచ్చింది.   ఆ సమయంలో కూడా ఇరువురి అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అని చెప్పారు. అయితే యతీం‍ద్ర వ్యాఖ్యలతో ఒక క్లారిటీ వచ్చినట్లుంది కానీ, సిద్ధరామయ్య, డీకేలే దీనిపై సృష్టత ఇస్తే దీనికి తెరపడినట్లు అవుతుంది. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)