Breaking News

గుజరాత్‌ హైకోర్టులో రాహుల్‌గాంధీకి ఎదురుదెబ్బ

Published on Tue, 05/02/2023 - 17:41

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి గుజరాత్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019 పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు గుజరాత్‌ హైకోర్టు నిరాకరించింది. తుది తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు వేసవి సెలవుల అనంతరం(జూన్‌ 4 తర్వాత) ఉత్తర్వులు ఇస్తామని  తెలిపింది. దీంతో పరువు నష్టం కేసులో హైకోర్టు ఆర్డర్‌ వచ్చే వరకు తన శిక్షపై స్టే విధించాలని రాహుల్‌ చేసిన ప్రయత్నం ఫలించలేదు.

కాగా 2019 కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఇంటిపేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ దోషిగా తేలడంతో సూరత్‌ కోర్టు రేండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అలాగే దీన్ని పైకోర్టులో సవాల్‌ చేసేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇస్తూ అప్పటి వరకు బెయిల్‌ మంజూరు చేసింది. అనంతరం పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో రాహుల్‌పై ఎంపీగా అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది.

అయితే ట్రయల్‌ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందంటూ రాహుల్‌ గాంధీ సూరత్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. అయితే తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును.. రెండేళ్ల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ రాహుల్‌ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్‌ ముంజూరు చేసింది. అనంతరం ఏప్రిల్‌ 20న రాహుల్‌ అభ్యర్థనను సెషన్స్‌ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఇదే కేసులో గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. గత బుధవారం గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ గీతా గోపి ఈ కేసు విచారణ నుంచి తప్పుకోవడంతో జస్టిస్ హేమంత్ ప్రచ్చక్‌కి విచారణను అప్పగించారు.
చదవండి: నేను రాహుల్ అభిమానిని..కాంగ్రెస్‌ ర్యాలీలో కన్నడ సూపర్‌ స్టార్

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)