Breaking News

పవిత్రకు దక్కని ఇంటి భోజనం

Published on Wed, 01/21/2026 - 07:49

కర్ణాటక: చిత్రదుర్గం యువకుడు రేణుకాస్వామి హత్యకేసులో నిందితులు నటి పవిత్రాగౌడ, నాగరాజ్, లక్ష్మణ్‌కు వారానికి ఒకసారి ఇంటినుంచి భోజనం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన బెంగళూరు నగర సెషన్స్‌కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైల్లో ఉన్న నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. సెషన్స్‌కోర్టు ఆదేశాలను ప్రశి్నస్తూ కామాక్షిపాళ్య సీఐ వేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు జడ్జి ఎం.నాగప్రసన్న విచారించారు. కింది కోర్టు ఆదేశాలను నిలిపివేశారు.  దీనిపై మీ వాదన ఏమిటో తెలియజేయాలని పవిత్రాగౌడ, నాగరాజు, లక్ష్మణ్‌లకు జడ్జి ఆదేశించారు.  

ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వరాదు 
ప్రభుత్వ ప్లీడర్లు వాదిస్తూ, నిందితులకు ప్రత్యేక సౌలభ్యాలను కల్పించరాదని పేర్కొంటూ స్టే ఇవ్వాలని కోరారు. ఇదే కేసులో నటుడు దర్శన్‌ కు ఇంటి భోజనం అందించారా అని జడ్జి ప్రశ్నించారు. లేదు, మొదటి నిందితురాలు పవిత్రాగౌడ, ఇతరులు లక్ష్మణ్, నాగరాజ్‌ల కు ఇంటి భోజనానికి సెషన్స్‌ కోర్టు ఆదేశించిందని ప్లీడర్లు తెలిపారు. జైలులోని ఆహారం సురక్షత, నాణ్యతతో ఉంటుందని చెప్పారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పలు రూలింగ్‌లను ఉదాహరించారు. ఆలకించిన న్యాయమూర్తి.. ఎంతపెద్దవారైనా చట్టం అందరికీ ఒకటే, ప్రత్యేక సదుపాయాలను కలి్పస్తే చర్యలు తీసుకుంటామని గతంలో సుప్రీంకోర్టు తెలిపింది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా సౌలభ్యాలు ఇవ్వడం చట్ట విరుద్ధమంటూ స్టే ఇచ్చారు. దీంతో నటి పవిత్రగౌడ   ఇంటి భోజనానికి దూరమయ్యారు.    

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)