Breaking News

Bihar: 20న సీఎంగా నితీష్ ప్రమాణం

Published on Mon, 11/17/2025 - 07:58

పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నవంబర్ 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని భావిస్తున్నారు. జేడీయూ, బీజేపీ, ఎల్‌జేపీ, హెచ్‌ఏఎం, ఆర్‌ఎల్‌ఎంలతో కూడిన నూతన ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు కార్యక్రమానికి పట్నాలోని గాంధీ మైదానం వేదికకానుంది.

జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ నవంబర్ 20 (గురువారం)న బిహార్ ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’కు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం పట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించనున్నారని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ఎన్డీఏ అగ్ర నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారన్నారు.

ఈ కార్యక్రమం కోసం గాంధీ మైదాన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం నవంబర్ 17 నుండి 20 వరకు గాంధీ మైదాన్‌ను సాధారణ ప్రజల సందర్శనకు మూసివేయనున్నారు. కాగా మిత్రపక్షాల మధ్య క్యాబినెట్ పదవుల పంపిణీకి ఫార్ములాను ఖరారు చేసినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. జెడీయూ,బీజేపీతో పాటు చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జెపీ (ఆర్‌వీ), మాంఝీ నేతృత్వంలోని హెచ్ఎఎంఎస్, ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్ఎంలు నూతన ప్రభుత్వంలో చేరనున్నాయి. రాష్ట్ర నూతన మంత్రివర్గంలో ఎల్జేపీ (ఆర్‌వీ)కి మూడు బెర్తులు లభించే అవకాశం ఉంది. హెచ్ఎఎంఎస్,  ఆర్ఎల్ఎంలకు ఒక్కొక్క బెర్తు లభించనున్నదని సమాచారం.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)