Breaking News

కాబోయే ఉపరాష్ట్రపతి నితీష్‌? వేడెక్కిన బీహార్‌ రాజకీయాలు

Published on Tue, 07/22/2025 - 13:48

పట్నా: భారతదేశ 14వ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ తన పదవికి రాజీనామా చేయడంతో, తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఉపరాష్ట్రపతిని చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ డిమాండ్‌ చేయడంతో బీహార్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇటువంటి డిమాండ్‌ రావడం సంచలనంగా మారింది. దీనిపై రాజకీయ వర్గాల్లో  చర్చ జరుగుతోంది. అయితే నితీష్ కుమార్ ఈ అంశంపై ఇంకా స్పందించలేదు.

నితీష్ కుమార్‌ను ఉపరాష్ట్రపతిగా చేస్తే అది బీహార్‌కు గర్వకారణంగా మారుతుందని ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ బచౌల్ వ్యాఖ్యానించారు. సీఎం నితీష్ విషయంలో తరచూ ఇటువంటి ఊహాగానాలు వినిపిస్తుంటాయి. కొన్ని నెలల క్రితం కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఒక ప్రసంగంలో నితీష్ కుమార్‌ను దేశ ఉప ప్రధానిని చేయాలంటూ డిమాండ్ చేశారు. చౌబే చేసిన  ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అయితే సీఎం నితీష్  దీనిపై ఎటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు. మరోవైపు ఈ ఏడాది చివరిలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వంలో పోటీ చేస్తామని బీజేపీ ఇప్పటికే వెల్లడించింది.

సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ రాజీనామా చేశారు.  అనారోగ్య కారణాలే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. తన రాజీనామాలో ఆయన రాష్ట్రపతి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ధన్‌ఖడ్‌ ఆకస్మిక రాజీనామా నేపధ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున నూతన ఉపరాష్ట్రపతి బీహార్‌కు చెందినవారై ఉంటారనే అంచనాలు వినిపిస్తున్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)