Breaking News

నితీష్‌ కుమార్‌ సంచలన ప్రకటన

Published on Wed, 07/09/2025 - 14:36

పట్నా: బిహార్‌లో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ (Nitish Kumar) సంచలన ప్రకటన చేశారు. మహిళా సాధికారతలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. బిహార్‌లో శాశ్వత నివాసితులు అయిన మహిళలకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ‘‘అన్ని రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో అన్ని వర్గాలు, స్థాయిలు, రకాల పోస్టులకు ప్రత్యక్ష నియామకాల్లో బిహార్‌కు చెందిన మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా 35% రిజర్వేషన్‌ అందిస్తాం’’ అని నితీష్‌ కుమార్‌ అన్నారు.

అన్ని విభాగాల్లో, అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ సేవల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళలు శ్రామిక శక్తిలోకి ప్రవేశించి పరిపాలనలో కీలక పాత్ర పోషించేలా చూడటం ఈ నిర్ణయం లక్ష్యమని ఎక్స్‌ వేదికగా ఆయన ప్రకటించారు. పట్నాలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది.  

కొత్త‌గా యువ‌జ‌న క‌మిష‌న్‌
అంతేకాదు.. రాష్ట్రంలోని యువతకు ప్రభుత్వ సహకారాన్ని మరింత పెంచుతూ కొత్త‌గా బిహార్ యువజన కమిషన్‌ (Bihar Youth Commission) ఏర్పాటు చేయనున్నట్లు నితీష్‌ ప్రకటించారు. 'బిహార్ యువతకు శిక్షణ ఇచ్చి మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించి.. సమర్థులుగా మార్చడానికి మా  ప్రభుత్వం బిహార్ యువజన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెల‌ప‌డానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దీనికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింద'ని నితీశ్ తెలిపారు.

యువత అభ్యున్న‌తికి తోడ్పాటు..
బిహార్ యువజన కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్, ఇద్దరు వైస్-చైర్‌పర్సన్‌లు, ఏడుగురు సభ్యులు ఉంటారు, వీరంతా 45 ఏళ్లలోపు వారే ఉంటారు. రాష్ట్రంలోని ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో స్థానిక యువతకు ప్రాధాన్యత లభించేలా క‌మిష‌న్‌ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రం వెలుపల చదువుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న బిహార్ విద్యార్థులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు పాటు ప‌డుతుంది. రాష్ట్రంలోని యువత సాధికార‌త‌, సంక్షేమానికి సంబంధించిన అన్ని విషయాలపై ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది.

చ‌ద‌వండి: ఎన్నిక‌ల వేళ‌.. బిహార్‌కు క‌నీవినీ ఎరుగ‌ని వ‌రాలు 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)