Breaking News

బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతల్లో నబీన్‌ 

Published on Tue, 12/16/2025 - 06:08

న్యూఢిల్లీ: బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నూతనంగా నియమితులైన నితిన్‌ నబీన్‌(45) సోమవారం కొత్త బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యక్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ చీఫ్‌ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌ షా, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆయనకు అభినందనలు తెలిపి, సన్మానించారు. 

సంస్థాగత నిర్వహణలో నబీన్‌కు ఉన్న అనుభవం ప్రజా సేవ, దేశ నిర్మాణ ప్రయాణంలో పారీ్టకి కొత్త దిశానిర్దేశం చేస్తాయని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యతల నిర్వహణలో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం అమిత్‌ షా, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధానలు ఆయనతో కొద్దిసేపు చర్చలు జరిపారు. అంతకుముందు, బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన నబీన్‌ సోమవారం మధ్యాహ్నం పట్నా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.

 విమానాశ్రయంలో సీఎం గుప్తా తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన్ను పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. కొత్త బాధ్యతలు చేపట్టిన నబీన్‌ బీజేపీ కురువృద్ధ నేత మురళీ మనోహర్‌ జోషి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌లను కలుసుకుని, వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. బిహార్‌ అసెంబ్లీకి అయిదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన నబీన్‌ ప్రస్తుతం నితీశ్‌ కేబినెట్లో మంత్రిగా వ్యవహరిస్తున్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)