Breaking News

‘విదేశీ’ వాటా తగ్గుతోంది

Published on Tue, 01/06/2026 - 02:09

భారత్‌లో ఉన్నత విద్యను అంతర్జాతీయీకరించాల్సిన ఆవశ్యకత ఉందని నీతి ఆయోగ్‌ ఇటీవల స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఐటీ నిపుణులు, వైద్యులు, ఇంజనీర్లు, విద్యావేత్తల వంటి నిపుణులకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన దగ్గరే ఉన్నత విద్యను అందించవచ్చు. జ్ఞానంతో నడుస్తున్న ప్రపంచంలో భారత్‌ నుంచి మేధావులు పరాయిగడ్డకు వెళ్లడం పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందన్నది నిపుణుల మాట. అయితే విదేశాలలో ఉన్న తమ బిడ్డల చదువుల కోసం భారత్‌ నుంచి కుటుంబాలు పంపిస్తున్న డబ్బుల వాటా తగ్గుతోంది.

వాటా పడిపోయింది.. 
మన దేశం నుంచి విదేశాల్లో ఉన్న తమవారికి పంపిన మొత్తం రెమిటెన్సుల్లో విదేశీ విద్య వాటా 2014–15లో 20.90%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–అక్టోబర్‌లో ఇది 8.32 శాతానికి పడిపోయింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సరళీకృత చెల్లింపుల పథకం కింద విదేశీ విద్యకు భారత్‌ నుంచి పలు దేశాలకు పంపిన మొత్తం 2014–15లో 0.28 బిలియన్‌ డాలర్ల నుంచి 2024–25 వచ్చేసరికి 2.92 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. వాస్తవానికి దేశ చరిత్రలో అత్యధికంగా 2021–22లో ఈ మొత్తం 5.17 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 2025–26 ఏప్రిల్‌–అక్టోబర్‌లో 1.43 బిలియన్‌ డాలర్లు విదేశాలకు చేరింది.

ముందంజలో చైనా..
వివిధ దేశాలకు చెందిన ఉన్నత విద్యాసంస్థల నిలయంగా చైనా ముందంజలో ఉంది. ఆ దేశంలో ఏకంగా 45 విదేశీ ఉన్నత విద్యా సంస్థలు (ఎఫ్‌హెచ్‌ఈఐ) పలు కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. భారత్‌లో ప్రస్తుతం 3 ఎఫ్‌హెచ్‌ఈఐలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మరో 15 సంస్థలు మన దేశంలో సేవలు అందించేందుకు సూత్రప్రాయ ఆమోదం దక్కించుకున్నాయి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)