Breaking News

ద్రవ్యోల్బణం తగ్గింపే మా లక్ష్యం

Published on Fri, 02/14/2025 - 02:27

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని, పెరిగిన ధరల భారం పౌరులపై పడకుండా చూసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Union Finance Minister Nirmala Sitharaman) అన్నారు. సాధారణ బడ్జెట్‌(General budget)పై చర్చలో భాగంగా గురువారం రాజ్యసభలో ఆమె ప్రసంగించారు. ‘‘వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 5.22 శాతంగా ఉంటే జనవరికల్లా దానిని 4.31 శాతానికి తగ్గించాం. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ లక్ష్యాలకు తగ్గట్లుగా ఇప్పుడు ద్రవ్యోల్బణం 4 శాతానికి దిగొస్తోంది’’ అని మంత్రి నిర్మల అన్నారు. 

ఈ సందర్భంగా పలువురు విపక్ష నేతలు మంత్రి ప్రసంగానికి అడ్డు తగిలారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విపక్ష, అధికార ఎన్‌డీఏ సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మోదీ సర్కార్‌ ఏ ఒక్క రాష్ట్రం పట్ల వివక్ష చూపలేదని నిర్మల బదులిచ్చారు. అయినా విపక్ష సభ్యులు మంత్రి సమాధానంతో సంతృప్తి చెందలేదు. తర్వాత పలు విపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. తర్వాత మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

అంతర్జాతీయంగా అనిశ్చితి
‘‘అభివృద్ధిని పరుగుపెట్టించే లక్ష్యంతో బడ్జెట్‌కు తుదిరూపునిచ్చాం. సమ్మిళిత అభివృద్ధికి బడ్జెట్‌ భరోసానిస్తుంది. ప్రైవేట్‌ రంగానికి పెట్టుబడుల ఊతం అందిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మౌలిక వసతుల కల్పన కోసం మూలధన వ్యయంలో పెట్టుబడుల పెంపుదల ఉంటుందేగానీ తగ్గుదల ఉండబోదు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, ప్రతికూల సవాళ్ల మధ్య బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రంగాలకు నిధుల కేటా యింపులు తగ్గాయి. 
పరిస్థి తులు మారుతున్నా అత్యంత కచ్చితత్వంతో ముందస్తు బడ్జెట్‌ అంచనాలు వేశాం. దేశ ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తు  న్నాం. అంతర్జాతీయ పరిస్థి తులు ఎప్పటికప్పుడు మా రుతుండటంతో ఎల్లప్పుడూ ఒకే వ్యూహం పనికిరాదు. అనిశ్చితి రాజ్య మేలుతుండటంతో మన దిగుమతులపై దాని పెను ప్రభావం కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెల కొన్న అస్తవ్యస్త ధోరణి మన ఆర్థికాభివృద్ధి పథంలో అవరోధంగా మారుతోంది. ద్రవ్యో ల్బణం కారణంగా టమాటా, ఉల్లి, బంగాళా దుంప చివరకు పప్పు ధాన్యాల ధరల్లోనూ తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

 అననుకూల వాతావరణం కారణంగా దిగుబడులు తెగ్గోసు కుపోవడంతో ఆహార ద్ర వ్యోల్బణం కట్టుతప్పుతోంది. సరుకు రవాణా గొలు సుల్లో ఏవైనా ఆటంకాలుంటే వెంటనే కేంద్ర మంత్రుల బృందం రంగంలోకి దిగి సమయానికి విదేశీ దిగుమతులు వచ్చేలా చూస్తోంది’’ అని నిర్మల తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత బడ్జెట్‌ తొలిసెషన్‌లో భాగంగా రాజ్యసభను వాయిదావేస్తున్నట్లు డిప్యూటీ ౖచైర్మన్‌ హరివంశ్‌ ప్రకటించారు. మార్చి పదో తేదీ ఉదయం 11 గంటలకు మళ్లీ రాజ్యసభ కార్యకలాపాలు మొదలుకానున్నాయని ఆయన చెప్పారు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)