Breaking News

నిపా వైరస్‌: భారత్‌కు ‘ఆరోగ్య సంస్థ’ హెచ్చరిక

Published on Sun, 02/01/2026 - 10:23

జనీవా: ఇటీవల భారత్‌లో వెలుగు చూసిన నిపా వైరస్ కేసులు అరుదైనవే అయినప్పటికీ, ఇవి అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (హూ) డైరెక్టర్ జనరల్ డాక్లర్‌ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు. ఈ వైరస్ వ్యాప్తి ప్రస్తుతం కేవలం భారతదేశానికే పరిమితమైందని, ఇతర దేశాల్లో ఎక్కడా ఇలాంటి కేసులు నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో నమోదైన నిపా కేసులు ప్రజారోగ్యానికి సవాలుగా మారవచ్చని, వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని టెడ్రోస్ సూచించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఇద్దరు నర్సులకు నిపా వైరస్ సోకినట్లు ధృవీకరించారు. 1998లో ఈ వైరస్‌ను తొలిసారిగా గుర్తించినప్పటి నుండి రాష్ట్రంలో ఇది మూడవసారి సంభవించిన వ్యాప్తి అని టెడ్రోస్.. సోషల్ మీడియా వేదికగా తెలిపారు. బాధితులతో సన్నిహితంగా ఉన్న సుమారు 190 మందిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రస్తుతానికి ఎవరిలోనూ వ్యాధి లక్షణాలు కనిపించలేదని ఆయన వెల్లడించారు.

బాధితుల్లో ఒకరు కోలుకుని డిశ్చార్జ్ కాగా, మరొకరు ఇంకా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని టెడ్రోస్ తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం,  స్థానిక ఆరోగ్య శాఖ ఇప్పటికే నిఘా పెంచినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ వివరించారు. ఆస్పత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చర్యలు తీసుకోవడంతో పాటు, వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్యను కూడా పెంచారు. ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. అయితే, ఈ వైరస్ ఒక వ్యక్తి నుండి మరొకరికి వేగంగా వ్యాపిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, అందుకే అంతర్జాతీయ ప్రయాణాలపై ఎటువంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

నిపా వైరస్ ప్రధానంగా గబ్బిలాల నుండి  లేదా కలుషితమైన ఆహారం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయని, ఇవి సాధారణ జ్వరాల మాదిరిగా ఉండటంతో గుర్తించడం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో మెదడు వాపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరణాల రేటు కూడా 40 శాతం నుండి 75 శాతం వరకు ఉండే ప్రమాదం ఉందని, అందుకే వ్యాధి రాకుండా నివారణ మార్గాలను అనుసరించడమే ఉత్తమమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

ఇది కూడా చదవండి: ‘నీట్’ కోసం ‘ఎన్ఆర్ఐ’లుగా మారి.. మరో బాగోతం

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)