Breaking News

ఓడిపోయా,ఇక డబ్బులు వేస్ట్‌.. బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

Published on Wed, 12/24/2025 - 14:47

 బాగాచదివి, మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని గొప్పగా చూసుకోవాలని ప్రతీ  అమ్మాయి, లేదా అబ్బాయి కలగంటారు. ఎంతో పట్టుదలగా  తమ కలను సాకారం చేసుకుంటారు. కానీ ఒక   టీనేజ్‌ అబ్బాయి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.   చదువులో రాణించలేకపోతున్నా మీ డబ్బులు  దండుగ అంటూ  ఏ తల్లిదండ్రీ భరించలేని పనిచేశాడు.

గ్రేటర్ నోయిడాలోని హాస్టల్‌లో  ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు భిహార్‌కు చెందిన ఆకాష్ దీప్.  ఢిల్లీ టెక్నికల్ క్యాంపస్ (DTC)లో బీటెక్ (కంప్యూటర్ సైన్స్)  మొదటి సంవత్సరం చదువుతున్న అతను  మంగళవారం సాయంత్రం ఆకాష్ దీప్ తన గదిలో ఉరి వేసుకుని  చనిపోయాడు. తన చదువు కోసం తల్లిదండ్రులు ఇకపై డబ్బు వృధా చేయకూడదనే కారణంతోనే ఈ పని చేసినట్లు ఒక సూసైడ్ నోట్ రాసి పెట్టాడు.  బయటకు వెళ్లి, తిరిగి వచ్చిన రూమ్‌మేట్ ఆకాష్ దీప్ ఉరి వేసుకోవడాన్ని గమనించి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాడు. కానీ అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు  ప్రకటించారు. పోలీసులు ఆకాష్ దీప్  ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సూసైడ్‌ నోట్‌లో ఏం ఉంది?
క్షమించండి, అమ్మా నాన్న, మీ కొడుకు బలహీనుడు. నా మరణానికి నేనే బాధ్యుడిని. దయచేసి నా మరణం గురించి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు.  అమ్మా, ఇంటర్‌లో ఒక ఏడాది వృధా చేశా..రినాలుగేళ్లు బీటెక్‌ చదివి, డబ్బు వృధా చేయాలనుకోవడం లేదు. తప్పుడు ఆశలు కలిగించడం ఇష్టంలేదు. అందుకే ఇక్కడితో ముగించేస్తున్నా..క్షమించండి." అని రాసుకొచ్చాడు. చదువుల ఒత్తిడి కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి అరవింద్ కుమార్ చహల్  తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. 

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది.. శివాజీపై నెటిజన్లు ఫైర్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)