Breaking News

Mumbai: మద్యం మత్తులో బస్సు స్టీరింగ్‌ గిరగిరా తిప్పడంతో..

Published on Mon, 09/02/2024 - 09:48

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో విచిత్ర పరిస్థితుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులోని ఒక ‍ప్రయాణికుడు ఏదో విషయమై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఆ ప్రయాణికుడు బస్సు స్టీరింగ్‌ను ఇష్టమొచ్చినట్లు గిరగిరా తిప్పాడు. దీంతో బస్సు అదుపు తప్పి, పలు వాహనాలను, పాదచారులను ఢీకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన లాల్‌బాగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన తొమ్మిది మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడి చర్యల కారణంగా, బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సు సియోన్‌లోని రాణి లక్ష్మీబాయి చౌక్ వైపు వెళుతోంది. ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)