Breaking News

గాంధీ చెప్పే మూడు కోతుల కథ వెనుక..

Published on Wed, 10/02/2024 - 11:33

నేడు దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు  జరుగుతున్నాయి. గాంధీ జీవితంతో ముడిపపడిన పలు కథనాలు మనం వింటుంటాం. వాటిలో  ఒకటే గాంధీ చెప్పే ‘మూడు కోతుల కథ’. ఆ మూడు కోతులు చెడు మాట్లాడవద్దు, చెడు వినవద్దు,  చెడు చూడవద్దు అనే సందేశాన్ని అందిస్తాయనే విషయం తెలిసిందే. అయితే గాంధీ దగ్గరకు ఈ మూడు కోతులు ఎలా వచ్చాయనే దాని వెనుక ఆసక్తికర ఘట్టం ఉంది.

గాంధీ చెప్పే మూడు కోతుల కథ సుమారు 90 ఏళ్ల క్రితం నాటిది. ఈ కోతుల బొమ్మలు జపాన్ నుంచి గాంధీకి బహుమతిగా వచ్చాయి. జపాన్‌కు చెందిన ప్రముఖ బౌద్ధ సన్యాసి నిచిదత్సు ఫుజీ గాంధీకి ఈ మూడు కోతుల బొమ్మలను బహూకరించారు. జపాన్‌లోని అసో కాల్డెరా అడవుల్లో జన్మించిన నిచిదత్సు ఫుజీ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. 19 ఏళ్ల ప్రాయంలోనే బౌద్ధ సన్యాసిగా మారాడు. 1917లో భారత్‌లో ఆయన తన మిషనరీ కార్యకలాపాలు ప్రారంభించాడు.

1923లో జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ సమయంలో నిచిదత్సు ఫుజీ జపాన్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఆయన తిరిగి భారత్‌ వచ్చాడు. 1931లో నిచిదత్సు ఫుజీ కలకత్తా చేరుకుని, నగరమంతా పర్యటించాడు. తన భారత పర్యటనలో నిచిదత్సు ఫుజీ మహాత్మా గాంధీని కలవాలనుకుని, వార్ధాలోని గాంధీ ఆశ్రమానికి వచ్చాడు. నిచిదత్సు ఫుజీని చూసి గాంధీ చాలా సంతోషించారు. అతను గాంధీకి మూడు కోతుల బొమ్మలను కానుకగా ఇచ్చాడు. గాంధీకి ఈ కోతి  బొమ్మలు ఎంతగా నచ్చాయంటే,  ఆయన వాటిని తన టేబుల్‌పై పెట్టుకున్నారు.

గాంధీని కలవడానికి వచ్చిన ప్రతివారూ ఆ టేబుల్‌పై ఉన్న మూడు కోతులను గమనించి, దానిలోని అంతర్థాన్ని తెలుసుకునేవారు. అనతికాలంలోనే  ఈ మూడు కోతుల సందేశం అందరికీ చేరింది. తరువాతి కాలంలో నిచిదత్సు ఫుజీ బీహార్‌లోని రాజ్‌గిర్‌లో శాంతి గోపురాన్ని నిర్మించారు. ఈ ప్రదేశంలో జపాన్ దేవాలయం కూడా ఉంది. జపనీస్ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో అందమైన తెల్లటి బుద్ధుని విగ్రహం  కనిపిస్తుంది. నిచిదత్సు ఫుజీ 1986  జనవరి 9న కన్నుమూశారు.

ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు

#

Tags : 1

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)