Breaking News

రైలు ప‌ట్టాల‌పై సిలిండ‌ర్‌.. ఉగ్ర‌వాదుల‌ ప‌నేనా?

Published on Tue, 09/10/2024 - 06:40

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలపై కుట్ర కోణం దాగింవుంద‌నే చర్చ జరుగుతోంది.  యూపీలోని కాన్పూర్‌లో  చోటుచేసుకున్న రైలు ప్రమాదం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. కాన్పూర్‌లోని అన్వర్‌గంజ్-కాస్‌గంజ్ రైల్వే మార్గంలో భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ ప‌ట్టాల‌పై సిలిండర్‌ ఉంచిన  ఉదంతాన్ని ప‌లు ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు.  ఆ స‌మ‌యంలో రైలు వేగం ఎక్కువగా ఉంది. డ్రైవ‌ర్ రైలును ఆపిన‌ప్ప‌టికీ, అది సిలిండర్‌ను ఢీకొంది. దీంతో పెద్ధ శ‌బ్ధం వ‌చ్చింది. ప్ర‌యాణికులు భ‌య‌కంపితుల‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగింది.

ఈ కేసును  ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాద కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, యూపీ ఏటీఎస్‌సహా అన్ని భద్రతా సంస్థలు ప్రాథమిక దర్యాప్తును ఇప్ప‌టికే ప్రారంభించాయి. దీనివెనుక‌ ఐఎస్ఐఎస్ కుట్ర ఉందన్న అనుమానాలు స‌ర్వ‌త్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్‌లో త‌ల‌దాచుకుంటున్న‌ ఉగ్రవాది ఫర్తుల్లా ఘోరీ ఒక ఆడియోను విడుదల చేశాడు. దానిలో రైలును బోల్తా కొట్టించాలంటూ దేశంలోని స్లీపర్ సెల్‌లను ఆదేశించిన‌ట్లు ఉంది. దీంతో ద‌ర్యాప్తు సంస్థ‌ల అధికారులు ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలను కూడా ఈ కోణంలోనే పరిశీలిస్తున్నారు. ఈమ‌ధ్య‌ ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌,  ఢిల్లీకి చెందిన 14 మంది ఉగ్ర‌వాదుల‌ను అరెస్టు చేశారు.

తాజాగా కాన్పూర్‌లోని రైల్వే ట్రాక్‌పై సిలిండర్‌ లభ్యమైన ప్రదేశంలో పోలీసులు, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.  కుట్ర పన్నారనే అనుమానంతో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కాన్పూర్ డీసీపీ వెస్ట్ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. దర్యాప్తు సంస్థలన్నీ తమ తమ స్థాయిలలో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నారో త్వరలోనే వెల్లడిస్తామని ఆయా సంస్థల అధికారులు తెలిపారు.  ఈ కేసులో ద‌ర్యాప్తున‌కు  డాగ్ స్క్వాడ్‌ల‌ను కూడా రంగంలోకి దించారు. ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల‌ కారణంగా ఈ కేసుకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు ధ్వంసమయ్యాయి. దర్యాప్తున‌కు ఇది ఆటంకం క‌లిగించే అంశంగా మారింది.  కాగా ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న బాటిల్‌లో మండే పదార్థాన్ని పోలీసు అధికారులు గుర్తించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)