Breaking News

ఉగ్రవాదులకు సిమ్‌ కార్డులు.. సతీష్‌ కోసం ఎన్‌ఐఏ గాలింపు చర్యలు

Published on Thu, 07/10/2025 - 21:30

కోలారు: కోలారు తాలూకా భట్రహళ్లి నివాసి సతీష్‌ గౌడ అనే వ్యక్తి కోసం  ఎన్‌ఐఎ అధికారులు  రావడం కలకలం రేపింది. అతడు లేకపోవడంతో విచారణకు రావాలంటూ ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న మొబైల్‌ సిమ్‌ కార్డును గతంలో సతీష్‌గౌడ యాక్టివేషన్‌ చేసిచ్చాడనే ఆరోపణలున్నాయి. నిందితుడు భట్రహళ్లిలోని భార్యతో కలిసి మూడేళ్లుగా ఉంటున్నాడు. బెంగుళూరు కోరమంగలలోని ఓ ప్రైవేటు టెలికాం కంపెనీలో పనిచేశాడు, అప్పుడు ఇతడు యాక్టివేట్‌ చేయించిన సిమ్‌ కార్డులనే ఉగ్రవాదులు ఉపయోగించారని 2023లో ఎన్‌ఐఎ అధికారులు గుర్తించి సతీ‹Ùగౌడకు నోటీసులు ఇచ్చారు. అప్పుడు విచారణకు హాజరయ్యాడు. ఇప్పుడు మరోసారి విచారణకు వచ్చారు.  

నా భర్త అమాయకుడు 
ఎన్‌ఐఎ అధికారులు వస్తున్నట్లు తెలిసి సతీష్‌గౌడ ఇంటి పరారైనట్లు తెలిసింది.  దాదాపు 3 గంటల పాటు ఇంట్లో తనిఖీచేసిన ఎన్‌ఐఎ అధికారులు బెంగళూరు ఇందిరనగరలో ఉన్న ఎన్‌ఐఎ ఆఫీసుకు రావాలని నోటీసులు ఇచ్చి వెనుదిరిగారు. 

తరువాత విలేకరులతో మాట్లాడిన సతీష్‌ గౌడ భార్య హేమావతి.. నా భర్త ఏ తప్పు చేయలేదు. కంపెనీ వారు రోజూ కొన్ని సిమ్‌లు యాక్టివేట్‌ చేయాలని టార్గెట్‌ ఇచ్చేవారు, కంపెనీ చెప్పినట్లు చేశాడు, ఆ కంపెనీలో ఉద్యోగం వదిలిన తరువాత వేరే కంపెనీలో పనిచేశాడు. ఇప్పుడే ఏ పనీ లేకుండా ఇంట్లో ఉంటున్నారని తెలిపింది. నిరపరాధి అయిన భర్త అరెస్టు చేస్తారనే భయంతో ఫోన్‌ కూడా స్విఛాప్‌ చేసుకుని ఎక్కడికి వెళ్లారో తెలియదని విలపించింది.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)