ఏపీ ప్రభుత్వంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌

Published on Sat, 08/24/2024 - 05:32

సాక్షి, న్యూఢిల్లీ: రెండు రోజుల వ్యవధిలో ఏపీలో జరిగిన మూడు ఘోరమైన ప్రమాదాలను జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా పరిగణించింది. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతిచెందడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. 

అలాగే, చిత్తూరు సమీపంలోని మురకంబట్టు ప్రాంతంలోని అపొలో మెడికల్‌ కాలేజీలో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యి 70 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్‌..అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాపట్నంలోని ఓ అనాథాశ్రమంలో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యి ముగ్గురు విద్యార్థులు మృతిచెందడం, 37మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంపై అసహనం వ్యక్తం చేసింది. 

ఈ 3 ఘటనలపై పత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ ఘటనల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందంటూ ఆరోపించింది. 2 వారాల్లో ఈ 3 ఘటనలపై సమగ్రమైన నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ శుక్రవారం చీఫ్‌ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. 

అచ్యుతాపురం ఘటనలో ఎఫ్‌ఐఆర్‌ స్టేటస్‌ రిపోర్ట్, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, నష్టపరిహారం వంటి విషయాలపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు ఏమైనా సాయం అందిందా లేదా అనే సమాచారాన్ని అందజేయాలని  ఆదేశించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను కూడా తమకు తెలపాలని పేర్కొంది. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)