Breaking News

రోడ్డు పక్కన.. ప్లాస్టిక్ కవర్లో నవజాత శిశువు

Published on Mon, 08/03/2026 - 11:59

పానిపట్: హర్యానాలోని పానిపట్‌లో అత్యంత దయనీయమైన ఘటన వెలుగు చూసింది. కిషన్‌పురా ప్రాంతంలోని శివ నగర్‌లో సుమారు ఒకరోజు వయసున్న నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్‌లో కట్టి రోడ్డు పక్కన పడేశారు. స్థానికుల అప్రమత్తతతో ఆ పసికందు ప్రాణాలు దక్కాయి. సోమవారం ఉదయం శివ నగర్ గలీలో  ఉంటున్న ఒక మహిళ తన ఇంటి బయట శుభ్రత పనులు చేస్తుండగా, పక్క ఇంటి ముందు పడివున్న ఒక ప్లాస్టిక్ కవర్‌లో ఏదో కదులుతున్నట్లు గుర్తించారు.

వెంటనే ఆమె చుట్టుపక్కల వారికి ఈ విషయాన్ని చెప్పారు. స్థానికులు వచ్చి ఆ కవర్ విప్పి చూడగా, అందులో నవజాత శిశువు ఉంది. సమాచారం అందుకున్న వెంటనే డయల్ 112 పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, శిశువును తొలుత సనౌలి రోడ్డులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారుల సమక్షంలో మెరుగైన చికిత్స నిమిత్తం పసికందును సివిల్ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ (స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్) వార్డుకు మార్చారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో శిశువుకు చికిత్స అందిస్తున్నారు. పసికందును రోడ్డు పక్కన పడేసిన వారి ఆచూకీ కోసం కిషన్‌పురా చౌకీ పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. శిశువును వదిలేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: భారత అధికారికి పాక్ రేంజర్ సెల్యూట్.. వీడియో వైరల్

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)