Breaking News

ఆ రెజ్లర్ అసలు మైనరే కాదు.. బ్రిజ్ భూషణ్ కేసులో కొత్త ట్విస్ట్

Published on Thu, 06/08/2023 - 07:09

న్యూఢిల్లీ: భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షులు బీజేపీ ఎంపీ బ్రిజ్  భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సదరు ఎంపీ లైంగికంగా వేధించినట్టు కేసు నమోదు చేసిన రెజ్లర్ మైనర్ కాదంటూ స్వయంగా ఆమె తండ్రే తెలిపారు.  దీంతో ఎంపీపై నమోదైన కేసుల్లో పోక్సో చట్టం కింద ఎంపీపై నమోదైన కేసు నుండి ఆయనకు ఉపశమనం లభించే అవకాశముంది.

పతకాలు గంగలో... 
గత కొంత కాలంగా భారత రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్  భూషణ్ శరణ్ సింగ్ పై ఏప్రిల్ 29న నమోదైన లైంగిక వేధింపుల కేసులో త్వరితగతిన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ భారత రెజ్లర్లు నిరవధికంగా నిరసన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ నూతన పార్లమెంట్ వద్ద రెజ్లర్లపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం, రెజ్లర్లు దీన్ని అవమానంగా భావించి తాము సాధించిన పతకాలను గంగానదిలో కలిపేయాలనుకోవడం, రైతు సంఘం నాయకులు కల్పించుకుని రెజ్లర్లను వారించడం వంటి వరుస పరిణామాల మధ్య రెజ్లర్లు ఈ ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు. 

కేంద్ర మంత్రి హామీ... 
అనంతరం భారత టాప్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో ఆరు గంటల పాటు చర్చించి విచారణ విషయమై  రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో అప్పటికి సమస్య సద్దుమణిగింది. 

తీరా చూస్తే... 
ఇంతలో ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణ చేసిన రెజ్లర్ సంఘటన జరిగే సమయానికి అసలు మైనరే కాదని స్వయంగా ఆమె తండ్రే వెల్లడించడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. కేసు నమోదు చేసిన సమయంలో ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో పుట్టుక వివరాల్లో తప్పులు దొర్లాయని ఆయన ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఎంపీపై పోక్సో చట్టం కింద నమోదైన కేసు నుంచి ఉపశమనం లభించే అవకాశముంది.  

ఇది కూడా చదవండి: రాతపూర్వక హామీ.. ఓ మెట్టుదిగిన రెజ్లర్లు    

Videos

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)