Breaking News

'ఏఐ' ముద్ర..పడాల్సిందే

Published on Thu, 09/18/2025 - 05:24

డీప్‌ఫేక్‌ వీడియోలు, చిత్రాలు ప్రపంచాన్ని కలవర పెడుతున్న అతిపెద్ద సమస్య. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగించి రూపొందించే ఈ కంటెంట్‌ విషయంలో మన దేశం కఠిన నియమాలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో పార్లమెంటరీ కమిటీ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. వీడియోలను రూపొందించే కంటెంట్‌ క్రియేటర్లకు లైసెన్స్ తోపాటు.. వీడియోలు, చిత్రాలను ఏఐతో రూపొందించినట్టు వెల్లడించే లేబులింగ్‌ వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. -సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి సంబంధించి.. లోక్‌సభ సభ్యుడు నిషికాంత్‌ దూబే నేతృత్వంలో ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఇటీవలే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఒక ముసాయిదా నివేదికను సమర్పించింది. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి ఏఐని ఉపయోగించే వ్యక్తులు లేదా కంపెనీలను గుర్తించి, విచారించడానికి కఠినమైన సాంకేతిక, చట్టపరమైన నియ మాలను అమలు చేయాలని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ఈ ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే.. భారత్‌లో కంటెంట్‌ క్రియేటర్స్‌ ఏఐని ఉపయోగించే విధా నం పెద్ద ఎత్తున మారుతుందని, అలాగే పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందన్నది నిపుణుల మాట.

బాధ్యులను పట్టుకోవచ్చు
ఏఐతో రూపొందిన తప్పుడు సమాచారం విషయంలో శిక్షా నిబంధనలను సవరించాలని, జరిమానాలను పెంచాలని కమిటీ తన నివేదికలో కోరింది. ‘ఏఐతో అభివృద్ధి చేసినట్టు తెలిపే సమాచారంతో వీడియోలు, చిత్రాలు, ఇతర అంశాలను ప్రజలు సులభంగా గుర్తించగలుగుతారు. అంతేకాకుండా నకిలీ వార్తలను వ్యాప్తి చేసిన బాధ్యులను సులభంగా పట్టుకోవచ్చు’ అని కమిటీ తెలిపింది. 

మీడియాకు విన్నపం
నకిలీ వార్తలను కట్టడి చేసేందుకు బలమైన అంతర్గత రక్షణ చర్యలను చేపట్టాలని మీడియా సంస్థలను కూడా పార్లమెంటరీ కమిటీ కోరింది. సమాచారం నిజమేనా కాదా అన్నది తెలుసుకునే కఠిన తనిఖీ వ్యవస్థ, వార్తా ప్రసారంలో నాణ్యత, కచ్చితత్వం ప్రమాణాలను కాపాడే అంబుడ్స్‌మన్ ను నియమించాలని సూచించింది. మోసపూరిత కంటెంట్‌ సులభంగా వైరల్‌ అయ్యే యుగంలో ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడానికి ఇలాంటి చర్యలు చాలా అవసరమని అభిప్రాయపడింది.

ఇప్పటికే కొన్ని..
డీప్‌ఫేక్‌ సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. నకిలీ ప్రసంగాలను అడ్డుకోగల;  డీప్‌ఫేక్‌ వీడియోలు, చిత్రాలను గుర్తించగల సాధనాలను అభివృద్ధి చేయడానికి రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. 

నమ్మదగినవిగా మారతాయి
కంటెంట్‌ అభివృద్ధి విషయానికొస్తే ప్రతిపాదిత నిబంధనలు.. క్రియేటర్లను అడ్డుకునే ప్రయత్నం ఎంత మాత్రమూ కాదనీ, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది నిపుణుల మాట. క్రియేటర్లు చేయాల్సిందల్లా తమ వీడియోలు, చిత్రాలను ఏఐతో రూపొందించినట్టు వీక్షకులకు కనిపించేలా వెల్లడించాలి. 

ఏఐతో రూపొందిన కంటెంట్‌తో నకిలీ వార్తలను వ్యాప్తి చేసే, పెట్టుబడి పెట్టే సృష్టికర్తలు, కంపెనీలను అడ్డుకోవడమే ఈ నిబంధనల లక్ష్యం. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అందరికీ మరింత పారదర్శకంగా, నమ్మదగినవిగా మారతాయి. 

10 కోట్లకు పైగా చానళ్లు
భారత్‌లో 10 కోట్లకు పైచిలుకు యూట్యూబ్‌ చానళ్లు ఉన్నట్టు సమాచారం. అయితే ఇందులో 7 లక్షల మంది క్రియేటర్లు మాత్రమే ఆదాయార్జన చేస్తున్నారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌.. ఈ సామాజిక మాధ్యమాలను వేదికలుగా చేసుకుని కోట్లాది మంది కంటెంట్‌ క్రియేటర్లు ఉన్నారు. 

రోజూ కోట్లాది వీడియోలు, చిత్రాలు పోస్ట్‌ చేస్తుంటారు. ఇంతటి విశాలమైన సామాజిక మాధ్యమాల ప్రపంచంలో తప్పుడు సమాచారం కట్టడి ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ పార్లమెంటరీ కమిటీ నిబంధనలు కఠినంగా అమలైతే కొంతైనా మార్పు రావడం ఖాయం అన్నది నిపుణుల మాట. భారత్‌లో కట్టడి చేస్తాం సరే.. అంతర్జాతీయంగా వచ్చి పడే కంటెంట్‌ను ఎలా నియంత్రిస్తారన్నది ముందున్న సవాల్‌. 

» సాధారణంగా సినిమా ప్రారంభంలో ‘చిత్ర నిర్మాణంలో జంతువులకు, పక్షులకు ఎలాంటి హానీ చేయలేదని, గ్రాఫిక్స్‌ ఉపయోగించాం’ అని ఓ ప్రకటన ఇస్తారు.  అదే తరహాలో ఇప్పుడు.. కంటెంట్‌ ఏఐతో సృష్టించినట్టు వెల్లడించాల్సి ఉంటుంది. 
»  ఏఐతో కంటెంట్‌ సృష్టించినట్టుగా వెల్లడించాలన్న తప్పనిసరి నిబంధన చైనాలో ఉంది.
»  యూరోపియన్  యూనియన్  గతేడాది ఏఐ యాక్ట్‌ను అందుబాటులోకి తెచ్చి దశలవారీగా అమలు చేస్తోంది.

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)