Breaking News

యువత కోసం కొత్తగా ఇంటర్న్‌షిప్‌ పథకం

Published on Fri, 10/04/2024 - 05:10

న్యూఢిల్లీ: యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని తీసుకొచ్చి0ది. ఏటా రూ.66,000 మేర ఆర్థికసాయం అందించనుంది. ఐదేళ్లకాలంలో మొత్తంగా కోటి మంది 21–24 ఏళ్ల యువత ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారని కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2024–25 ఆర్థికసంవత్సరంలో తొలుత పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.800 కోట్లు ఖర్చుచేయనుంది. 

ఈ ఆర్థికసంవత్సరంలో డిసెంబర్‌ రెండో తేదీన ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా 1,25,000 మంది లబి్ధపొందే వీలుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టాప్‌ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ చేసే యువతకు బీమా సౌకర్యం సైతం కల్పించనున్నారు. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే pminternship.mca.gov.inలో యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

రూ.6,000 అదనం 
నెలకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.60,000 ఆర్థికసాయం అందనుంది. దీనికి అదనంగా ఏడాదిలో ఒకసారి రూ.6,000 గ్రాంట్‌ ఇవ్వనున్నారు. దీంతో ఏడాదికి ప్రతి లబ్ధి దారుడు రూ. 66,000 లబ్ధి పొందనున్నారు. ఈ వెబ్‌పోర్టల్‌లో అక్టోబర్‌ 12వ తేదీ నుంచి 25వ తేదీలోపు అందుబాటులో ఉన్న సమాచారంతో దరఖాస్తులను నింపొచ్చు. 

వీటిని అక్టోబర్‌ 26వ తేదీన షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. తర్వాత అభ్యర్థులను అక్టోబర్‌ 27వ తేదీ నుంచి నవంబర్‌ 7వ తేదీలోపు కంపెనీలు ఎంపిక చేస్తాయి. ఎంపికైన అభ్యర్థు లు తమ నిర్ణయాన్ని నవంబర్‌ 8–15ల మధ్య తెలపాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా మూడు ఆఫర్స్‌ ఇస్తారు.  

టాప్‌ 500 కంపెనీల ఎంపిక 
గత మూడేళ్లలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) నిధి పథకంలో భాగంగా తమ నికరలాభాల్లో కొంతమేర సమాజసేవ కోసం సవ్యంగా ఖర్చుచేసిన టాప్‌ 500 కంపెనీలను ఈ పథకం కోసం కేంద్రం ఎంపికచేస్తుంది. 

రిజర్వేషన్లూ వర్తిస్తాయి! 
అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లనూ వర్తింపజేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అలెంబిక్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లు 1,077 ఆఫర్లను ఇప్పటికే ప్రకటించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)