Breaking News

కోవిడ్‌ పుట్టుక ప్రకృతిసిద్ధమే! 

Published on Wed, 07/07/2021 - 02:39

న్యూఢిల్లీ: కరోనా ఎలా వచ్చిందో, దేని ద్వారా వచ్చిందోననే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. చాలామంది ఈ వైరస్‌ చైనాలోని ఒక ల్యాబ్‌లో ఉత్పన్నమైందని భావిస్తున్నా, ఈ వాదనకు తగ్గ శాస్త్రీయ ఆధారాలు దొరకలేదు. అయితే ఈ వైరస్‌ ప్రకృతిలోనే సహజంగా ఉద్భవించిందని ద లాన్సెట్‌ జర్నల్‌లో కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు బయాలజిస్టులు, వైరాలజిస్టులు, డాక్టర్లు, ఎకాలజిస్టులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు.

తాజాగా జరిపిన పరిశోధనల్లో వైరస్‌ ప్రకృతిసిద్ధంగా ఉత్పన్నమైందనేందుకు బలమైన సాక్ష్యాలు లభించాయని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా ఈ వైరస్‌ ల్యాబ్‌ నుంచి వచ్చిందనేందుకు ఎలాంటి సైంటిఫిక్‌ సాక్ష్యాలు లేవని గుర్తు చేసింది. గతేడాది లాన్సెట్‌ ప్రచురించిన నివేదికలో సైతం ఈ బృందం ల్యాబ్‌ లీకేజీ వాదనలను తోసిపుచ్చింది.

పరిశోధన అవసరం: ల్యాబ్‌ లీకేజ్‌పై ఆరోపణలతో ఎలాంటి ప్రయోజనం లేదని, గబ్బిలాల నుంచి మనిషికి వైరస్‌ సోకిన విధానంపై పరిశోధన ద్వారానే తదుపరి ప్రమాదాలు నివారించగలమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో వాదోపవాదాలను పక్కనబెట్టి శాస్త్రీయ పరిశోధనా మార్గాన్ని అనుసరించినప్పుడే భవిష్యత్‌ మహమ్మారులను ఎదుర్కోగలమని తెలిపారు. వైరస్‌ పుట్టుకపై శాస్త్రీయ పరిశోధన కోసం డబ్లు్యహెచ్‌ఓ, ఇతర సంస్థలు చైనా నిపుణులతో కలిసి లోతైన పరిశోధన సాగించాలని సూచించారు.  ఈ విషయమై స్పష్టమైన వివరాలు తెలియడానికి సంవత్సరాలు పట్టవచ్చని, కానీ ప్రపంచ శాస్త్రీయ సమాజం తప్పక ఈపని చేయాలని తెలిపారు. అధ్యయనంలో బోస్టన్‌ యూనివర్సిటీ, మేరీలాండ్‌ యూనివర్సిటీ, గ్లాస్గోవ్‌ యూనివర్సిటీ, ద వెల్‌కమ్‌ ట్రస్ట్, క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీతో పాటు పలు సంస్థలకు చెందిన సైంటిస్టులు పాల్గొన్నారు.   

Videos

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి పోరాడుతాం: బొత్స

Nizamabad: ముగ్గురు చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు శంకర్

తమ్మినేని సీతారాం హౌస్ అరెస్ట్... ఆముదాలవలసలో ఆందోళన

Sahasra Mother: హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర..!

బాబు సర్కార్ అప్పులు.. కాగ్ నివేదికపై వైఎస్ జగన్ రియాక్షన్

కూకట్‌పల్లి పీఎస్ వద్ద సహస్ర కుటుంబసభ్యుల ఆందోళన

ఏడు అంశాల అజెండాగా పీఏసీ సమావేశం

నాకు నటించాల్సిన అవసరం లేదు కూన రవికుమార్ బండారం బయటపెట్టిన సౌమ్య

కూటమి ప్రభుత్వంలో పెన్షనర్ల కూడు లాక్కుంటున్నారు

Sahastra Incident: క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకే బాలుడు వెళ్లాడు: సీపీ మహంతి

Photos

+5

కాబోయే మరదలితో రిబ్బన్‌ కట్‌ చేసిన సారా.. సచిన్‌ పుత్రికోత్సాహం (ఫొటోలు)

+5

పట్టుచీరలో చందమామలా.. అనసూయ కొత్త ఫొటోలు

+5

ఆఖరి శ్రావణ శుక్రవారం పూజ : నిండు గర్భిణి సోనియా ఆకుల (ఫొటోలు)

+5

తెలంగాణ : ప్రసిద్ద వెంకటేశ్వర ఆలయం రత్నాలయం.. తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)

+5

ప్రభాస్ ఫస్ట్‌ హీరోయిన్‌ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)