Breaking News

‘బాహుబలి తిరిగొచ్చాడు’.. వీడియో వైరల్‌

Published on Thu, 09/04/2025 - 17:08

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ప్రవేశించింది. ఢిల్లీ వీధులు చెరువుల్లా మారాయి. ఈ క్రమంలో వాహనదారులకు ట్రాఫిక్‌ తిప్పలు తప్పడం లేదు.  అయితే, ట్రాఫిక్‌ జామ్‌ను తప్పించుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా.. తన బైక్‌ను భుజాలపై మోసుకుంటూ వెళ్లాడు.. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరో బాహుబలి నగరంలోకి వచ్చేశాడంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

భారీ వర్షాలు కారణంగా గురుగ్రామ్‌- ఢిల్లీ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు తమ బైక్‌ను భుజాలపై మోస్తూ నడుచుకుంటూ వెళ్లారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌ను జాగ్రత్తగా భుజాలపై బ్యాలెన్స్ చేస్తూ, కార్లు, ద్విచక్ర వాహనాలతో నిండిపోయిన రోడ్డులో నడుస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది.


కాగా, యమునా నది వరద డేంజర్ మార్క్  దాటింది. పలు కాలనీలోకి వరద నీరు చేరుకుంది. యమునా బజార్ సహా పలు కాలనీలలో ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. దాదాపు 15 వేల మంది ప్రజలను తరలించినట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ వెల్లడించింది. మరో వారం పది రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

హర్యానాలోని  హత్నికుండ్‌ బ్యారేజ్ నుంచి రోజు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. 67 సంవత్సరాల తర్వాత మూడోసారి 207 మీటర్ల డేంజర్ మార్కును దాటింది. వరద నీరుతో పాటు మురుగునీరు కూడా ప్రవహిస్తుంది. వరద మురుగతో ప్రజలకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)