Breaking News

ఇంజనీర్, ర్యాపర్, మేయర్, ఇప్పుడు ప్రధాని?

Published on Wed, 09/10/2025 - 03:30

కాఠ్మండు: నేపాల్‌లో ఒకవైపు రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతుండగా మరోవైపు, అక్కడి యువత తదుపరి ప్రధానిని మీరే చేపట్టాలంటూ కాఠ్మండు మేయర్‌ బాలేంద్ర షా అలియాస్‌ బాలేన్‌కు పెద్ద ఎత్తున మద్దతుగా ఆన్‌లైన్‌లో పోస్టులు పెడుతున్నారు. దీంతో, ఇప్పుడు బాలేన్‌ పేరు మారుమోగిపోతోంది. రాజధానిలో పరిణామాల నేపథ్యంలో బాలేన్‌ ఫేస్‌బుక్‌లో మంగళవారం ..‘ర్యాలీ నిర్వాహకులు 28 ఏళ్లలోపు వాళ్లే పాల్గొనాలనే వయో పరిమితి విధించిన కారణంగానే సోమవారం జరిగిన ర్యాలీలో పాల్గొనలేకపోయా.

వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది నా అభిప్రాయం’అని పేర్కొన్నారు. ‘ఇది జెన్‌ జెడ్‌ చేపట్టిన ఆకస్మిక ఉద్యమమన్నది సుస్పష్టం. నేను కూడా వారికి పెద్దవాడిలా అనిపించవచ్చు. వారి ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆలోచనలను అర్థం చేసుకోవాలనుకుంటున్నా. రాజకీయ పార్టీలు, నాయకులు ఈ ర్యాలీని తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోరాదు.

యువతకు పూర్తి మద్దతు తెలుపుతున్నా’అని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టుతో ఆయన పేరు అన్ని రకాల సామాజిక మాధ్యమ వేదికల్లోనూ మారుమోగిపోయింది. ‘బాలేన్, సారథ్యం మీరే చేపట్టండి’అని ఎక్స్‌లో ఒకరు కోరారు. 1990లో కాఠ్మండులో పుట్టిన బాలేన్‌ అక్కడే సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుకున్నారు. భారత్‌లోని కర్నాటకలో స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌లో పీజీ చేశారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)