Breaking News

నెహ్రూ లైబ్రరీ ఇక ప్రధానమంత్రి లైబ్రరీ

Published on Sat, 06/17/2023 - 06:06

న్యూఢిల్లీ: ఢిల్లీలో తీన్‌మూర్తి భవన ప్రాంగణంలో ఉన్న ‘నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ’ పేరును కేంద్ర ప్రభుత్వం ప్రైమ్‌మినిస్టర్స్‌ మ్యూజియం, లైబ్రరీ సొసైటీగా మార్చింది. తొలి ప్రధాని నెహ్రూ అధికారిక నివాసం తీన్‌మూర్తి భవన్‌ను ప్రభుత్వం గత ఏడాది ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’గా మార్చిన సంగతి తెలిసిందే. నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ పేరును ప్రైమ్‌మినిస్టర్స్‌ మ్యూజియం, లైబ్రరీ సొసైటీగా మారుస్తూ తీర్మానించినట్లు కేంద్ర సాంస్కృతిం శాఖ శుక్రవారం ప్రకటించింది.

నెహ్రూ నుంచి మోదీ దాకా ప్రధానుల వివరాలు, వారి ఘనత, దేశ అభివృద్ధిలో వారి పాత్రకు సంబంధించిన సమాచారాన్ని ఈ లైబ్రరీలో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. సొసైటీ ఉపాధ్యక్షుడైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నెహ్రూ తీన్‌మూర్తి భవన్‌లో 16 ఏళ్లకుపైగా 1964 మే 27న చనిపోయే దాకా ఉన్నారు. 1966లో ఇక్కడ ‘నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ’ ఏర్పాటయ్యింది.  
 
అల్పబుద్ధిని చాటుకున్న ప్రభుత్వం: కాంగ్రెస్‌  

నెహ్రూ లైబ్రరీ పేరు మార్పుపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అల్పబుద్ధిని చాటుకుందని అన్నారు. భవనాల పేరు మార్చినంత మాత్రాన మహోన్నత వ్యక్తుల పేరు ప్రఖ్యాతులను చెరిపివేయలేరని పేర్కొన్నారు.   చరిత్ర లేనివారే ఇతరుల చరిత్రను చెరిపివేసేందుకు ప్రయత్నిస్తారని ఎద్దేవా చేశారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)