ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
మొబైల్ టార్చ్ వెలుగులో బస్సు డ్రైవింగ్
Published on Mon, 07/06/2026 - 09:50
దొడ్డబళ్లాపుర(కర్ణాటక): అన్నీ సక్రమంగా ఉంటేనే ప్రయాణం సవ్యంగా సాగేది. కానీ కేఎస్ ఆర్టీసీ బస్సు రాత్రి ప్రయాణంలో హెడ్లైట్లు పనిచేయకపోవడంతో డ్రైవరు నానా తిప్పలు పడ్డారు. మొబైల్ఫోన్ లైటు వేసుకుని డ్రైవింగ్ చేసిన ప్రమాదకర ఘటన కలబుర్గిలో వెలుగుచూసింది. శనివారం రాత్రి కలబుర్గి నుంచి చించోళికి వెళ్తున్న బస్సు హెడ్లైట్లు పనిచేయలేదు. చిమ్మ చీకటిలో కండక్టర్ మొబైల్తో టార్చ్ వేయగా ఆ వెలుగులో డ్రైవర్ బస్సు నడిపాడు.
బస్సులో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ తతంగంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. లైట్లు పనిచేయకపోతే బస్సును నిలిపివేసి, ప్రయాణికులను మరో బస్సులో పంపించాలన్నారు. ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. ఈ వీడియో వైరల్గా కాగా, డ్రైవర్ను సస్పెండ్ చేశారు. డిపోలలో మెకానిక్ల నిర్లక్ష్య ధోరణి వల్ల బస్సులలో యాంత్రిక లోపాలు వస్తున్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు.
Kalaburagi–Chincholi 🚨⚠️
Looks like KKRTC bus driver overdriving mobile phone torch light at night? 🤷♂️@DriveSmart_IN @dabir @RCBengaluru @InfraEye @sumanthchandar @anil_lulla pic.twitter.com/aYPBds4YNF— Dave (Road Safety: City & Highways) (@motordave2) July 5, 2026
Tags : 1