Breaking News

అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు తప్పొప్పులు నేర్పించాలి: బాంబే హైకోర్టు

Published on Wed, 08/28/2024 - 10:51

ముంబై: బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధంపుల కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అబ్బాయిలకు చిన్నతనం నుంచే వారి ఆలోచన ధోరణిలో మార్పులు తీసుకురావాలని తెలిపింది. అమ్మాయిలను, మహిళలను గౌరవించడం నేర్పంచాలని సూచించింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని.. అందుకే మగపిల్లలకు చిన్నప్పటి నుంచే చెడు ప్రవర్తనపై అవగాహన కల్పించాలని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథివీరాజ్ చవాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది.

ద్లాపూర్‌లోని తమ పాఠశాలలో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుపై సుమోటోగా స్వీకరించిన బాంబే హైకోర్టు..తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. బాలురకు లింగ సమానత్వం, సున్నితత్వం గురించి అవగాహన కల్పించాలని తెలిపింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని, పిల్లలకు సమానత్వం గురించి బోధించే వరకు ఏదీ మారదని పేర్కొంది.

‘సమాజంలో  పురుషాధిక్యత  ఇప్పటికీ ఉన్నాయి. మన ఇంట్లో పిల్లలకు సమానత్వం గురించి చెప్పేంత వరకు ఏమీ జరగదు. అప్పటి వరకు నిర్భయ వంటి చట్టాలన్నీ పని చేయవు. మనంం ఎప్పుడూ అమ్మాయిల గురించే మాట్లాడుతుంటాం. అబ్బాయిలకు ఏది ఒప్పు, తప్పు అని ఎందుకు చెప్పకూడదు? అబ్బాయిల ఆలోచనా ధోరణిని చిన్నతనంలోనే మార్చాలి. మహిళలను గౌరవించడం నేర్పించాలి’ అని పేర్కొంది.

కాగా గత వారం  బద్లాపూర్‌లో కిండర్ గార్టెన్ విద్యార్థినులపై పాఠశాల అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. రిటైర్డ్ పోలీసు, రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ అధ్యాపకుడు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. పాఠశాలల్లో ఈ ఘటనలను ఎలా అరికట్టాలనే దానిపై కమిటీ సిఫారసులతో ముందుకు రావలని తెలిపింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)