Breaking News

Covishield: ఈయూ పాస్‌పోర్ట్‌లో కోవిషీల్డ్‌ను చేర్చేలా చూడండి! 

Published on Tue, 06/29/2021 - 12:34

న్యూఢిల్లీ: యూరోపియన్‌ యూనియన్‌ ‘కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ పాస్‌పోర్ట్‌’లో కోవిషీల్డ్‌ టీకాను కూడా చేర్చే విషయంలో జోక్యం చేసుకోవాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. కోవిషీల్డ్‌ను అందులో చేర్చనట్లయితే ఆయా దేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, వ్యాపారులు సమస్యలను ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, ఆ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందని హెచ్చరించింది. 

ఇప్పటి వరకు 4 టీకాలకు మాత్రమే యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ ఆమోదం లభించింది. అవి ఫైజర్‌/బయోఎన్‌టెక్, మోడెర్నా, వాక్స్‌జెర్విరియా(ఆస్ట్రాజెనెకా–ఆక్స్‌ఫర్డ్‌), జాన్సన్‌. ఈ టీకాలు తీసుకున్నవారికి మాత్రమే ఈయూ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఉంటుంది. భారత్‌లో ఎక్కువమంది తీసుకున్న కోవిషీల్డ్‌ను ఈయూ వ్యాక్సినేషన్‌ పాస్‌పోర్ట్‌లో చేర్చనట్లయితే, అనేక విపరిణామాలుంటాయని విదేశాంగ మంత్రి జైశంకర్‌కు రాసిన లేఖలో ఎస్‌ఐఐ సీఈఓ ఆధర్‌ పూనావాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు భారత్‌లో 30 కోట్లమంది కోవిషీల్డ్‌ తీసుకున్నారని, మొత్తంగా 50% భారత జనాభా ఈ టీకానే తీసుకునే అవకాశముందని తెలిపారు.

ఇక్కడ చదవండి: మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్‌
Prashant Bhushan: వ్యాక్సిన్‌ వ్యతిరేక ట్వీట్లు.. షాకిచ్చిన ట్విటర్‌

Videos

రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!

అల్లు అర్జున్ తో నిహారిక లవ్ స్టోరీ

కమ్మేస్తోన్న కరోనా కాటేరమ్మ కొడుకునూ వదలని వైరస్

సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ

అందాల పోటీల మీదనే కాదు.. ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టాలి: కేటీఆర్

గుల్జార్ హౌస్ లో అసలేం జరిగింది?

YSRCP కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన టీడీపీ గూండాలు

ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

పాక్‌కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం

ఓటమి భయంతో YSRCP నేతలపై దాడి

Photos

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)

+5

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

+5

కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ (ఫొటోలు)

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు