Breaking News

అంబేడ్కర్‌ విగ్రహంపై దాడా?

Published on Thu, 08/15/2024 - 05:43

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహంపై దాడి జరిగిందన్న విషయం తెలుసుకొని జాతీయ ఎస్సీ కమిషన్‌ ౖచైర్మన్‌ కిషోర్‌ మక్వానా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘అసలా ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు వచ్చి0ది?’ అని పూర్తి వివరాలు ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ బృందంతో ఆయన సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దుండగుల్ని విడిచి పెట్టేది లేదని స్పష్టం చేశారు. ‘అంబేడ్కర్‌ విగ్రహం జాతీయ సంపద. దానిపై ఎవరూ దాడి చేయకూడదు. అమానుషంగా ప్రవర్తించకూడదు. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. 

త్వరలోనే ఏపీకి కమిషన్‌ నుంచి బృందాన్ని పంపి పూర్వాపరాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకుంటామని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని వైఎస్సార్‌సీపీ బృందానికి హామీ ఇచ్చారు. విజయవాడ నడి»ొడ్డున వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్‌ విగ్రహంపై ఆగస్టు 8న దాడి జరిగిన విషయం విదితమే. 

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి నేతృత్వంలో మాజీ మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, మేరుగ నాగార్జున, నందిగం సురేశ్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌లతో కూడిన బృందం బుధవారం ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌తో భేటీ అయింది. ‘అంబేడ్కర్‌ విగ్రహానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి. పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలి. త్వరగా దుండగుల్ని పట్టుకొని భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడాలి’ అనే మూడు డిమాండ్లతో వినతిపత్రం అందజేసింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)