Breaking News

NCPCR: మదర్సాల్లో బాలల హక్కుల ఉల్లంఘన

Published on Thu, 09/12/2024 - 06:31

న్యూఢిల్లీ: మదర్సాల్లో విద్యార్థులకు సరైన విద్య బోధించడం లేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌) ఆందోళన వ్యక్తం చేసింది. చాలావరకు మదర్సాలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, అక్కడి పాఠ్యపుస్తకాల్లో అభ్యంతకర అంశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో తాజాగా సమగ్ర అఫిడవిట్‌ సమరి్పంచింది.

 నాణ్యమైన, సమగ్రమైన విద్య పొందడం బాలల ప్రాథమిక హక్కు కాగా, ఆ హక్కు మదర్సాల్లో ఉల్లంఘనకు గురవుతోందని ఆక్షేపించింది. విద్యాహక్కు చట్టం–2009 సైతం ఉల్లంఘనకు గురవుతున్నట్లు తెలియజేసింది. మదర్సాల్లో తగిన విద్యా బోధన జరగకపోగా, మరోవైపు ఆరోగ్యకరమైన వాతావరణం, జీవితంలో పైకి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడం లేదని అఫిడవిట్‌లో స్పష్టంచేసింది. 

బిహార్, మధ్యప్రదేశ్, పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లో ముస్లిమేతరులను సైతం చేర్చుకొని, ఇస్లామిక్‌ మత విద్య బోధిస్తున్నారని తప్పుపట్టింది. ఇలా చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 28(3)కు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. ‘‘మదర్సాల్లో బోధిస్తున్న విద్య పిల్లలకు పూర్తిగా ఉపయోగపడేది కాదు. అక్కడ సరైన పాఠ్యప్రణాళిక లేదు. విద్యాహక్క చట్టం సెక్షన్‌ 29లో పేర్కొన్న మూల్యాంకన విధానాలు అమలు కావడం లేదు. అర్హత లేదని ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. నిధుల విషయంలోనూ పారదర్శకత కనిపించడం లేదు.

 క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. విద్యాహక్కు చట్టం నిర్దేశించిన ప్రమాణాలను లెక్కచేయకుండా చాలావరకు మదర్సాలు సొంతంగానే ఉపాధ్యాయులను నియమించుకుంటున్నాయి. వారికి తగిన విద్యార్హతలే ఉండడం లేదు. మదర్సాల్లో సంప్రదాయ విధానాల్లో ఖురాన్‌తోపాటు ఇతర మత గ్రంథాలు బోధిస్తున్నారు. ఇదంతా అసంఘటితమైన, అసంబద్ధమైన విద్యా వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. పాఠ్యాంశాలు అభ్యంతకరంగా ఉంటున్నాయి. అత్యున్నత మతం ఇస్లాం మాత్రమే అని పిల్లల మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు’’ అని పేర్కొంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)