Breaking News

అందుకే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు: శరద్‌ పవార్‌

Published on Thu, 01/05/2023 - 08:30

పుణే: కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ(షిండే వర్గం పొత్తు) పాలనపై విమర్శలు గుప్పించే క్రమంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య కారణంగానే.. పెళ్లీడుకొచ్చినా యువకులకు అమ్మాయిలు దొరకడం లేదని అన్నారు. 

బుధవారం ఎన్సీపీ జన్‌ జాగర్‌ యాత్ర ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశంలో రెండు వర్గాల ప్రజల మధ్య చీలిక ఏర్పడింది. తద్వారా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం జరుగుతోంది. నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. చేసుకునేందుకు వేరే పనులు కూడా దొరకడం లేదు. ఉద్యోగం లేని వాళ్లకు పిల్లను ఎవరు ఇస్తారు? అందుకే వివాహాలు సకాలంలో జరగడం లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. బాగా చదువుకున్న వాళ్లు.. తమకు ఉద్యోగాలు కావాలని ప్రభుత్వాల్ని నిలదీయాలి. అది వాళ్ల హక్కు కూడా అని పవార్‌ సూచించారు.  

దేశంలో రైతులు ఉత్పత్తి పెంచితే ఆకలి సమస్య తీరుతుంది. కానీ, అధికారంలో ఉన్నవారు రైతుల శ్రమకు తగ్గ గిట్టుబాటు ధర ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. బదులుగా.. దళారుల ప్రయోజనాలను కాపాడుతూ సామాన్య ప్రజలను ద్రవ్యోల్బణ చట్రంలోకి నెట్టేస్తున్నారు అంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు ఈ కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి. 

‘‘ఓసారి నేను ఓ ఊరికి వెళ్లాను. అక్కడ పాతిక నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న కొందరు యువకులు పిచ్చాపాటిగా మాట్లాడుతూ కనిపించారు. ఎందుకిలా ఖాళీగా ఉన్నారు అని అడిగితే.. తమ ప్రాంతంలో చేయడానికి ఏం పనుల్లేవని బదులిచ్చారు. వాళ్లలో కొందరు డిగ్రీలు, మరికొందరు పీజీలు కూడా చేశారు. పని కోసం వేరే ఊరు వెళ్లొచ్చు కదా అంటే.. ఎంత దూరం వెళ్లాలని వాళ్లే నన్ను ప్రశ్నించారు. పని లేక పిల్లను ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని వాళ్లు నాతో చెప్పారు’’ అని పవార్‌ గుర్తు చేసుకున్నారు.  

ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించారు. దేశంలో రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగులుతున్న పరిస్థితులు చూస్తున్నాం.  ఎందుకంటే.. ఎన్నికల హామీలను నెరవేర్చే దమ్ము వాళ్ల దగ్గర లేదు కాబట్టి అంటూ కేంద్రంలోని బీజేపీపై ఆయన ఘాటు విమర్శ చేశారు. ఇక మహారాష్ట్రలోనూ అలాగే ఉందన్న ఆయన.. తమ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కొలువు దీరాక రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని, తద్వారా రాష్ట్రంలోనూ నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని పవార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)