Breaking News

శరద్‌ పవార్‍ను హత్య చేస్తామంటూ బెదిరింపులు!

Published on Fri, 06/09/2023 - 14:58

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపు సందేశం వచ్చింది. ఆయన్ను సోషల్‌ మీడియా వేదికగా ఓ దుండగుడు పవార్‌ని చంపేస్తామని ట్విట్‌ చేసినట్లు ఎన్సీపీ పేర్కొంది. ఈ మేరకు పవార్‌ కుమార్తె లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే నేతృత్వంలోని ఎన్సీపీ కార్యకర్తల ప్రతినిధి బృందం ముంబై పోలీసు చీఫ్‌  ఫన్సాల్కర్‌ను కలిసి చర్యల తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

ఎన్సీపీ అధినేత పవార్‌ ఫేస్‌బుక్‌లో ఓ దుండగుడు నీకు నరేంద్ర దభోల్కర్‌ లాంటి గతి తప్పదు అని బెదిరింపు సందేశం వచ్చిందని పోలీసులకు తెలిపారు. నిజానికి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్‌ను ఆగస్టు 20, 2013న పుణేలో మార్కింగ్‌ వాక్‌ చేస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఆ విధంగానే పవార్‌ని చంపుతామని ఫేస్‌బుక్‌లో బెదిరింపు సందేశం వచ్చింది.

 ఈ మేరకు ఆయన కుమార్తె ఎమ్మెల్యే సులే బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ల ప్రింట్ అవుట్‌లను పోలీసులుకు సమర్పించారు. అందుకు సంబంధించిన సమాచారం అందిందని ముంబై పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేసే పనిలో ఉన్నామని చెప్పారు. 

(చదవండి: ప్రపంచ వేదికల మీద భారత దేశ ప్రతిష్టను దిగజార్చింది ఎవరో తెలుసుకో.. జైరాం రమేష్ ఆగ్రహం )

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)