Breaking News

నాకు చెప్పడానికి నువ్వు ఎవరు.. అజిత్‌కు శరద్‌ పవార్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published on Sat, 07/08/2023 - 20:07

ముంబై: మహారాష్ట్ర పాలిటిక్స్‌ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఎన్సీపీకి షాకిస్తూ అజిత్‌ పవార్‌.. షిండే వర్గంలో చేరడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో షిండే సర్కార్‌ అజిత్‌ పవార్‌కు డిప్యూటీ సీఎం కుర్చీని ఇచ్చింది. ఈ క్రమంలో అజిత్‌ పవార్‌కు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

తాజాగా శరద్‌ పవార్‌ రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా పవార్‌ మాట్లాడుతూ.. తాను అలసిపోనని, రిటైర్ కానని.. కార్యకర్తలు తనను పని చేయాలని కోరుకుంటున్నారని అజిత్‌కు కౌంటర్ ఇచ్చారు. మొరార్జీ దేశాయ్ ఏ వయసులో ప్రధాని అయ్యారో తెలుసా? నాకు ప్రధానమంత్రి లేదా మంత్రి కావాలని లేదు. కానీ ప్రజలకు సేవ చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను అంటూ కామెంట్స్‌ చేశారు. తనకు పనిచేసే శక్తి ఉందని చెప్పుకొచ్చారు. నేను అలసిపోను... రిటైర్ కూడా కాను.. అని అటల్ బిహారీ వాజపేయి మాటలను పవార్ గుర్తు చేశారు. తనను రిటైర్ కావాలని చెప్పడానికి అజిత్ ఎవరు? అంటూ ఫైరయ్యారు. 

ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర రాజకీయాలపై ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, ఆధిత్య ఠాక్రే సంచలన కామెంట్స్‌ చేశారు. బీజేపీ.. సీఎం ఏక్‌నాథ్‌ షిండే టార్గెట్‌ చేసిందంటూ కామెంట్స్‌ చేశారు. తాజాగా ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ..  ఏక్ నాథ్ షిండేను సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయనను బీజేపీ హైకమాండ్ కోరినట్లు తమకు సమాచారం ఉందన్నారు. దీంతో, ఠాక్రే వ్యాఖ్యలు రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇక, అజిత్ పవార్.. షిండే కేబినెట్‌లో చేరినప్పటి నుంచి మహారాష్ట్రలో సీఎం మార్పు తథ్యం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఇది కూడా చదవండి: పొలం బాట పట్టి.. రైతులతో రాహుల్‌ గాంధీ ములాఖత్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)