వీర్యం తారుమారు చేసినందుకు రూ.1.5 కోట్ల జరిమానా

Published on Tue, 06/27/2023 - 06:19

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌(ఎన్‌సీడీఆర్‌సీ) రూ.1.5 కోట్ల జరిమానా విధించింది. కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన మహిళకు ఆమె భర్త వీర్యం బదులు మరొకరి వీర్యాన్ని ఎక్కించడమే ఇందుకు కారణం. అసిస్టెట్‌ రిప్రొడక్టివ్‌ టెక్నిక్‌(ఏఆర్‌టీ) విధానంలో సంతానం కోసం దంపతులు ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత 2009 జూన్‌లో వారికి కవలలు జని్మంచారు.

శిశువులకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించగా, వారి తండ్రి అతడు కాదని తేలింది. మరొకరి వీర్యంతో వారు జన్మించినట్లు స్పష్టమయ్యింది. మనోవేదనకు గురైన దంపతులు తమకు న్యాయం చేయాలని, రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా ఆసుపత్రిని ఆదేశించాలని కోరుతూ ఎన్‌సీడీఆర్‌సీని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ దర్యాప్తు వారికి అనుకూలంగా కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. దంపతులకు రూ.1.5 కోట్ల పరిహారం చెల్లించాలని ప్రైవేట్‌ ఆసుపత్రిని ఆదేశించింది. ప్రైవేట్‌ హాస్పిటళ్లలో కృత్రిమ గర్భధారణ వల్ల జన్మించిన ప్రతి శిశువు డీఎన్‌ఏ ప్రొఫైల్‌ను తయారీ చేసి ఇచ్చేలా నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కమిషన్‌ అభిప్రాయపడింది.    

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)