Breaking News

National Nutrition Week 2024 : స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా మారాలంటే..

Published on Sun, 09/01/2024 - 06:43

భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుండి ఏడు వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తారు. సరైన పోషకాహారం, ఆరోగ్యం మధ్య విడదీయరాని సంబంధం ఉంది. ఆటగాళ్లకు  ఆరోగ్యంతో కూడిన ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యం. ప్రస్తుతం దేశంలో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌లకు అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి.

క్రీడా మైదానంలో ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలంటే ఏ క్రీడా జట్టుకైనా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ఎంతో అవసరం. అథ్లెట్లు, వారి కోచ్‌లకు అనుసంధానంగా క్రీడా పోషకాహార నిపుణులు  పని చేస్తుంటారు. అథ్లెట్ లేదా ఆటగాడి పనితీరు వారు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా సూచనలు, సలహాలు అందించే ఆరోగ్య నిపుణులు రాష్ట్రానికి లేదా దేశానికి పతకాలు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.

స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ కావడానికి బీఎస్‌సీ (ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్) కోర్సు చేయాల్సి ఉంటుంది. 12వ తరగతి ఉత్తీర్ణులయ్యాక మెడికల్ స్ట్రీమ్‌లోకి వెళ్లేవారు లేదా న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన ఈ వృత్తిని ఎంచుకోవచ్చు. అలాగే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్ లేదా న్యూట్రిషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు చేయడం ద్వారా స్పోర్ట్స్‌ న్యూట్రిషనిస్ట్‌గా ఉపాధి లేదా ఉద్యోగం పొందవచ్చు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎంఎస్‌సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్) కోర్సును ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) అందిస్తోంది.  డైటెటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సును అన్నామలై యూనివర్సిటీ అందిస్తోంది. డైటెటిక్స్‌లో ఎంఎస్‌సీని కేరళ విశ్వవిద్యాలయం అందిస్తోంది.

స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడానికి, అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ లాంటి ప్రఖ్యాత సంస్థ నుండి సర్టిఫికేట్ పొందడం అవసరం. క్రీడా పోషకాహార నిపుణులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి, ఉద్యోగ మార్గాలను అందుకోవచ్చు. 

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)