Breaking News

ఎన్‌ఈపీలో ప్రతి భారతీయ భాషకు తగు గౌరవం

Published on Sun, 07/30/2023 - 05:20

న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) ద్వారా దేశంలోని ప్రతి భాషకూ సముచిత గౌరవం లభిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం భాషపై రాజకీయం చేసే వారు తమ దుకాణాలను మూసేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. శక్తి సామర్థ్యాల ఆధారంగా కాకుండా భాష ప్రాతిపదికన ప్రతిభను అంచనా వేయడం వల్ల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఎన్‌ఈపీ ప్రారంభమై మూడో వార్షికోత్సవా న్ని పురస్కరించుకుని ఏర్పాటైన ‘అఖిల భారతీయ శిక్షా సమాగమ్‌’నుద్దేశించి ఆయన ప్రసంగించారు.

‘మాతృభాషలో విద్యా బోధన ద్వారా భారతీయ విద్యార్థులకు న్యాయం చేసే కొత్త రూపానికి నాంది పలుకుతోంది. సామాజిక న్యాయం దిశగా ఇది చాలా ముఖ్యమైన అడుగు’అని ప్రధాని అన్నారు. ప్రపంచంలోని అనేక భాషలు, వాటి ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి.. అనేక అభివృద్ధి చెందిన ముఖ్యంగా యూరప్‌ దేశాలు విద్యాబోధన స్థానిక భాషల్లో జరుగుతున్నందునే ఒక అడుగు ముందుకు వేశాయని చెప్పారు.

మన దేశంలో అనేక ప్రాచీన భాషలున్నప్పటికీ, వాటిని వెనుకబాటుకు చిహ్నంగా చూపుతు న్నారని, ఇంగ్లిష్‌ మాట్లాడలేని వారిని విస్మరించారని, వారి ప్రతిభను గుర్తించడం లేదని మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఎన్‌ఈపీ రాకతో దేశం ఇప్పుడు ఈ నమ్మకాన్ని విస్మరించడం ప్రారంభించింది. ఐక్యరాజ్యసమితిలో కూడా నేను భారతీయ భాషలోనే మాట్లాడతాను’ అని చెప్పారు. సామాజిక శాస్త్రాల నుంచి ఇంజినీరింగ్‌ విద్య వరకు అన్ని సబ్జెక్టుల్లోనూ భారతీయ భాషల్లోనే బోధిస్తున్నారని తెలిపారు.

భాషపై విద్యార్థులు పట్టుసాధించగలిగితే, ఎలాంటి అవరోధాలు లేకుండా వారిలో నైపుణ్యం, ప్రతిభ బయటికొస్తాయని ప్రధాని అన్నారు. ప్రపంచం భారతదేశాన్ని కొత్త అవకాశాల వేదికగా చూస్తోంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలంటే అనేక దేశాలు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నా యని వెల్లడించారు. ఇప్పటికే టాంజానియా, అబుధాబిల్లో ఐఐటీ క్యాంపస్‌లు నెలకొల్పార ని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శ్రీ (ఎస్‌హెచ్‌ఆర్‌ఐ) పథకం కింద మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ నిధులను విడుదల చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)