Breaking News

నేడు రాజ్యాంగ దినోత్సవం

Published on Wed, 11/26/2025 - 04:24

న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పాత పార్లమెంట్‌లోని చారిత్రక సెంట్రల్‌ హాల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సారథ్యం వహించనున్నారు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్‌ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని 2015 నుంచి ఏటా నవంబర్‌ 26వ తేదీన రాజ్యాంగ దినం, సంవిధాన్‌ దివస్‌ను జరుపుకుంటున్నారు. రాజ్యాంగంలోని కొంత భాగం ఆ వెంటనే అమల్లోకి రాగా, మిగతావి దేశ రిపబ్లిక్‌గా అవతరించాక 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.

బుధవారం సంవిధాన్‌ సదన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతితోపాటు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా,, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ తెలిపింది. రాష్ట్రపతి రాజ్యాంగ పీఠికను చదువు తారని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రసంగిస్తారంది. ఈ సందర్భంగా తెలుగు, తమిళం, మలయాళం తదితర 9 భాషల్లో ఉన్న రాజ్యాంగ ప్రతులను డిజిటల్‌గా ఆవిష్కరించనున్నట్లు ఆ శాఖ తెలిపింది.

పౌరులు ఆన్‌లైన్‌లో పాల్గొని రాజ్యాంగ పీఠికను చదవచ్చు. హమారా సంవిధాన్‌–హమారా స్వాభిమాన్‌ పేరుతో క్విజ్, వ్యాస రచన పోటీలు కూడా ఉంటాయని వివరించింది. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు, వివిధ శాఖలు, అనుబంధ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా సదస్సులు, సమావేశాలు, చర్చా గోష్టులు, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)