Breaking News

త్వరలో కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవం! 9 ఏళ్ల పాలనకు గుర్తుగా..

Published on Tue, 05/16/2023 - 15:20

భారత్‌ కొత్త పార్లమెంటు భవనాన్ని మే నెలాఖరు కల్లా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని బీజేపీ తొమ్మిదేళ్ల పాలనుకు గుర్తుగా నిర్మించిన ఈ కొత్త పార్లమెంట్‌ భవనం పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ భవనాన్ని దాదాపు 970 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు అంతస్తుల్లో నిర్మించారు. ఇందులో సుమారు 1,224 మంది ఎంపీలు ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఇందులో భోజన గదులు, విస్తారమైన పార్కింగ్‌ స్థలాలు ఉన్నాయి. ఇది భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వ చిహ్నంగా ఉండనుంది.

ఈ కొత్త పార్లమెంట్‌ నిర్మాణంలో జ్ఞాన్‌ ద్వార్‌, శక్తి ద్వార్‌, కర్మ ద్వార్‌ అనే మూడు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వాటిని వీఐపీలు, సందర్శకులు, అధికారుల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలుగా కేటాయించారు. దీనిని 2020 డిసెంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉండగా, ఈ ప్రాంభోత్సవంలో భాగంలో నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల ప్రభుత్వానికి గుర్తుగా బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ నెల రోజుల పాటు భారీగా ప్రత్యేక ప్రచార ర్యాలీలను నిర్వహించేందుకు ప్లాన్‌ చేసింది.

ఈ మేరకు మే 30న ప్రధాని మోదీ భారీ ర్యాలీ ప్రచారాన్ని ప్రారంభిస్తారని, ఆ మరుసటి రోజే ప్రధాని రెండో ర్యాలీని నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల క్రితం మే 26, 2014న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తదుపరి మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని దర్కించుకుని నిరాటంకంగా తొమ్మిదేళ్లు పాలించారు.

అందుకు గుర్తుగా దేశ వ్యాప్తంగా బీజేపీ సినియర్‌ నేతలు సుమారు 51 ర్యాలీలు నిర్వహించనుండగా, దాదాపు 396 లోక్‌సభ స్థానల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు బీజేపీ పేర్కొంది. ఈ ర్యాలీలు, బహిరంగ సభలకు బీజేపీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించనున్నట్లు సమాచారం
(చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..)

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)