Breaking News

రికార్డు బద్ధలు కొట్టిన ప్రధాని మోదీ

Published on Fri, 07/25/2025 - 10:17

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనత సాధించారు. వరుసగా అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన జాబితాలో ఇందిరా గాంధీ రికార్డును బద్ధలు కొట్టారు. 

భారత దేశంలో  వరుసగా సుదీర్ఘకాలం ప్రధాని పదవిలో కొనసాగిన ఘనత.. జవహార్‌ లాల్‌ నెహ్రూది. ఆయన అత్యధిక కాలం (6,130 రోజులు) ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత రికార్డు ఇందిరా గాంధీ(4,077 రోజులు) పేరిట ఆ ఘనత ఉండేది. తాజాగా ఆ రికార్డును నరేంద్ర మోదీ బ్రేక్‌ చేశారు.

శుక్రవారం(జులై 25)తో నరేంద్ర మోదీ భారత దేశ ప్రధానిగా 4,078 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఇందిరాగాంధీ రికార్డును అధిగమించినట్లైంది. అలాగే.. భారత్‌కు సుదీర్ఘకాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన రెండో వ్యక్తి ఘనతకు సొంతం చేసుకున్నారు. అంతేకాదు..

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన వ్యక్తిగా, రెండు దఫాలు ప్రధాని పదవీ కాలం పూర్తి చేసుకున్న వ్యక్తి.. మోదీనే. అలాగే.. కాంగ్రెస్‌యేతర ప్రధానిగా, హిందీయేతర రాష్ట్ర వ్యక్తిగానూ మోదీ నిలిచారు. 

  • మోదీ 2014 మే 26న మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • 2019లో రెండవసారి, 2024లో మూడవసారి పదవిలోకి వచ్చారు.

  • నరేంద్ర మోదీ ఇప్పటివరకు (జూలై 25, 2025 వరకు) భారతదేశ ప్రధానమంత్రిగా 4,078 రోజులు పాలన అందించారు.

  • ఇప్పటిదాకా మొత్తం కాలం 11 సంవత్సరాలు, 1 నెల, 29 రోజులు

  • ఫలితంగా వరుసగా  భారత ప్రధానిగా చేసిన ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి, భారతదేశంలో రెండవ అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా మోదీ నిలిచారు.

ఇందిరా గాంధీ భారతదేశ ప్రధానమంత్రిగా రెండు విడతలలో సేవలందించారు:

మొదటిసారి పదవీకాలం.. 

24 జనవరి 1966 నుండి 24 మార్చి 1977, 11 సంవత్సరాలు, 2 నెలలు

రెండోసారి పదవీకాలం

14 జనవరి 1980 నుండి 31 అక్టోబర్ 1984 (ఆమె హత్యకు ముందు వరకు) 4 సంవత్సరాలు, 9 నెలలు, 17 రోజులు

మొత్తం పదవీ కాలం

15 సంవత్సరాలు, 11 నెలలు, 17 రోజులు

దేశానికి స్వాతంత్య్రంచ్చినప్పటి నుంచి నెహ్రూ ఆ పదవిలో కొనసాగారు. జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశపు మొదటి ప్రధానమంత్రిగా 15 ఆగస్టు 1947న పదవీ బాధ్యతలు స్వీకరించి, 27 మే 1964న ఆయన మరణించేవరకు పదవిలో కొనసాగారు. అంటే.. మొత్తం 16 సంవత్సరాల 286 రోజులు ఆ పదవిలో ఉన్నారన్నమాట. ఇది భారత ప్రధానమంత్రిగా ఇప్పటివరకు అత్యధిక కాలం సేవలందించిన రికార్డు నెహ్రూదే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)