Breaking News

ప్రధాని మోదీ ‘రామ ప్రతిజ్ఞ’ నెరవేరింది!

Published on Wed, 01/17/2024 - 13:01

మూడు దశాబ్దాల కిత్రం అయోధ్యను సందర్శించిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాడు.. అక్కడి పరిస్థితులను చూసి, తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ, రామాలయ నిర్మాణం జరిగే వరకూ అయోధ్యకు రానంటూ ప్రతిజ్ఞ చేశారు. 

అది.. 1991, డిసెంబర్ 11.. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు సాగిన ఐక్యతా యాత్రలో పాల్గొన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.. 1992, జనవరి 14న అయోధ్యను సందర్శించారు. రామ్‌లల్లాను దర్శించుకున్నాక, రామాలయ నిర్మాణం జరిగిన తర్వాతనే తాను అయోధ్యకు వస్తారని ప్రతిజ్ఞ  చేశారు. నాడు అయోధ్యకు వచ్చినప్పుడు మోదీ ఒక సాధారణ కార్యకర్త. నాటి మోదీ కల నేడు సాకరమయ్యింది. ప్రధాని మోదీ తన మొదటి అయోధ్య పర్యటనలో జానకీ మహల్ ట్రస్ట్‌లో బసచేశారు.

ఇది రామజన్మభూమికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రస్ట్‌ నిర్వాహకులు రామ్‌కుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, నరేంద్ర మోదీ తొలిసారి ఇక్కడికి వచ్చినప్పుడు రూమ్ నంబర్ 107లో బస చేశారని తెలిపారు. ఆ సమయంలో బీజీపీ సీనియర్‌ నేత మురళీ మనోహర్ జోషి 108 నంబర్‌ రూమ్‌లో బస చేశారని పేర్కొన్నారు. జానకీ మహల్‌లోనేవారు భోజనం చేశారని, అప్పుడు తన వయసు 35 ఏళ్లు అని, మోదీకి కూడా అదే వయసు ఉండవచ్చన్నారు. 

నేడు ఆ గది శిథిలావస్థకు చేరుకుందని, దీంతో ఆ గదికి తాళం వేశామన్నారు. నాడు కఠిన ప్రతిజ్ఞ చేసిన మోదీ 28 సంవత్సరాల వరకూ అయోధ్య ముఖం చూడనే లేదు. 1992, జనవరి 14 వరకూ, అంటే 28 ఏళ్ల పాటు మోదీ అయోధ్యకు రాలేదు. 

2019, నవంబర్ 9న రామమందిరానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 2022లో ప్రధాని మోదీ అయోధ్యకు వచ్చి, దీపోత్సవంలో పాల్గొన్నారు. 2023 డిసెంబర్ 30న అయోధ్యలో రోడ్ షో నిర్వహించారు. ఇప్పుడు 22న రామమందిరాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య వస్తున్నారు. ఈ నేపధ్యంలో నాటి మోదీ ప్రతిజ్ఞ చర్చల్లో నిలిచింది.
ఇది కూడా చదవండి: ఆ రెండు విగ్రహాలను ఏం చేయనున్నారు?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)