Breaking News

అభిమానికి పాదరక్షలు 

Published on Tue, 04/15/2025 - 05:12

ఈ ఫొటోలో కన్పిస్తున్న వ్యక్తి పేరు రాంగోపాల్‌ కశ్యప్‌. హరియాణాలోని యమునానగర్‌ వాసి. మోదీకి వీరాభిమాని. ఆయన ప్రధాని అయ్యేదాకా చెప్పులు వేసుకోబోనని 14 ఏళ్ల క్రితం భీషణ ప్రతిజ్ఞ చేశారు. సోమవారం యమునానగర్‌లో బహిరంగ సభ సందర్భంగా మోదీ ఆయన్ను కలిశారు. 

బూట్లు కానుకగా ఇవ్వడమే గాక వాటిని ధరించడంలో సాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అందులో కశ్యప్‌ చెప్పుల్లేకుండా మోదీ వద్దకు వెళ్లి కరచాలనం చేయడం కన్పిస్తోంది. తర్వాత ఆయన్ను మోదీ తనతో పాటు కూచుండబెట్టుకున్నారు.

 ‘‘ఇలాంటి ప్రతిజ్ఞ ఎందుకు చేయాల్సి వచ్చింది? నీకు పాదరక్షలు తొడుగుతున్నా. ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు సుమా!’’అంటూ ప్రేమగా మందలించారు. కొత్త బూట్లు సౌకర్యంగా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. ‘‘నాపై కశ్యప్‌ అభిమానానికి చలించిపోయాను. ఆయనకు బూట్లు ధరింపజేసే అవకాశం లభించినందుకు నిజంగా ఆనందంగా ఉంది’’అంటూ ఎక్స్‌లో మోదీ పోస్ట్‌ చేశారు. ‘‘ఇలాంటి కోట్లాదిమంది అభిమానులే నా బలం. వారి ఆదరణను వినమ్రంగా స్వీకరిస్తున్నా. వారంతా సంఘసేవ ద్వారా జాతి నిర్మాణానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నా’’అన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)