Breaking News

ఉత్తరాఖండ్‌ మార్గంలో నడవాలి

Published on Mon, 11/10/2025 - 02:12

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంపై ప్రధాని  మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు రాకుండా ధైర్యంగా చర్యలు చేపట్టిందని, ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తోందని, చట్టవిదరుద్ధమైన మత మార్పిడులను సమర్థంగా అడ్డుకుంటోందని చెప్పారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు సైతం ఉత్తరాఖండ్‌ మార్గంలో నడవాలని సూచించారు. యూసీసీ అమలుపై ఉత్తరాఖండ్‌ చర్యలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. మత మార్పిడుల నియంత్రణ చట్టం, అల్లర్ల నియంత్రణ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తోందని తెలిపారు.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం అవతరించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం డెహ్రాడూన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రూ.8,260.72 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల భూములు కబ్జా కాకుండా, జనాభాలో అవాంఛనీయ మార్పులు రాకుండా ఇక్కడి బీజేపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. అభివృద్ధి ప్రయాణంలో అడ్డంకులను తొలగించుకుంటూ ఉత్తరాఖండ్‌ శరవేగంగా ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మారనుందని అన్నారు.

రాష్ట్ర ప్రజలే నాకు స్ఫూర్తి  
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు. ఉత్తరాఖండ్‌తో తనకు గొప్ప అనుబంధం ఉందన్నారు. కొండలపై ప్రతికూల వాతావరణంలో జీవిస్తూ కష్టపడి పనిచేసే ఇక్కడి ప్రజలు తనకు నిత్యం స్ఫూర్తినిస్తుంటారని చెప్పారు. ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దేనని తేల్చిచెప్పారు. రాష్ట్రం బలం ఆధ్యాత్మిక శక్తిలోనే ఉందన్నారు. గత 25 ఏళ్లలో అనూహ్యమైన ప్రగతి సాధించిందని కొనియాడారు.

విద్య, పర్యాటకం, ఆరోగ్యం, ఇంధనం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు. 25 ఏళ్ల క్రితం రాష్ట్రం బడ్జెట్‌ రూ.4,000 కోట్లు మాత్రమేనని, ఇప్పుడు రూ.లక్ష కోట్లకు చేరిందని స్పష్టంచేశారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని, అందుకోసం ప్రజలంతా ఉమ్మడిగా కృషి చేయాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్‌లోని ఆలయాలు, ఆశ్రమాలు, ధ్యాన కేంద్రాలు, యోగా కేంద్రాలను గ్లోబల్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తామని చెప్పారు. 

Videos

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు