Breaking News

Nagpur issue కొనసాగుతున్న కర్ఫ్యూ, స్థానిక ఎన్నికల కోసమే ఇదంతా?

Published on Wed, 03/19/2025 - 11:13

నాగ్‌పూర్‌: మొఘల్‌ పాలకుడు ఔరంగజేబు ‘సమాధి తొలగింపు’పై చెలరేగిన హింస అనంతరం నాగ్‌పూర్లోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొత్వాలి, గణేష్‌ పేత్, తహసీల్, లకద్‌గంజ్, పచ్‌పావోలి, శాంతి నగర్, సక్కర్‌దార, నందన్‌వన్, ఇమామ్‌బాడ, యశోధర నగర్‌. కపిల్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.    

కాగా అదేరోజు సాయంత్రం మధ్య నాగ్‌పూర్‌లో చెలరేగిన హింసలో ముగ్గురు డీసీపీలు (డిప్యూటీ కమిషనర్లు ఆఫ్‌ పోలీస్‌) సహా 12 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు. హింసకు సంబంధించి పోలీసులు 15 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలో, అవసరానికి అనుగుణంగా సడలింపులపై సంబంధిత ప్రాంత డీసీపీ నిర్ణయం తీసుకుంటారని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సెంట్రల్‌ నాగ్‌పూర్‌లోని చిట్నిస్‌ పార్క్‌ ప్రాంతంలోని మహల్‌లో హింస చెలరేగింది. 

ఔరంగజేబు సమాధి తొలగింపు కోసం ఒక మితవాద సంస్థ చేపట్టిన ఆందోళనలో ఒక వర్గానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారన్న పుకార్లతో అల్లర్లు చెలరేగాయి. ఓల్డ్‌ భండారా రోడ్డు సమీపంలోని హన్సపురి ప్రాంతంలో రాత్రి 10.30 నుండి 11.30 గంటల మధ్య మరో ఘర్షణ చెలరేగింది. ఒక అల్లరి మూక అనేక వాహనాలను తగలబెట్టింది. ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లు, ఒక క్లినిక్‌ను ధ్వంసం చేసింది. ఈ సంఘటనలల్లో అనేక మంది గాయపడ్డారు. వరుసగా రెండో రోజు కూడా  కర్ఫ్యూ కొనసాగుతోంది. రాష్ట్రంలో కలహాలకు దారితీసే చిన్న సంఘటనలను కూడా తీవ్రంగా పరిగణించి, వాటిని మొగ్గలోనే తుంచివేయాలని మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా జిల్లా ఎస్పీలను కోరారు.

నాగ్‌పూర్‌ అల్లర్లు ప్రభుత్వ ప్రేరేపితమే– జరంగే  
ఛత్రపతి సంభాజీనగర్‌: నాగ్‌పూర్‌లో హింసను ప్రభుత్వ ప్రేరేపితమేనని, పట్టణంలో అశాంతికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే కారణమని మరాఠా కోటా కార్యకర్త మనోజ్‌ జరంగే మంగళవారం ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం వారిదే. ఒకవేళ సమాధిని తొలగించాలనుకుంటే అది వారికి నిమిషంలో పని. కాంగ్రెస్‌ అప్పట్లో తప్పు చేసి ఉంటే ఇప్పుడు దాన్ని సరిదిద్దే అవకాశం వారికి ఉంది . ఒకే సమయంలో రెచ్చగొట్టే ప్రకటనలు అదే సమయంలో సమాధి చుట్టూ పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు దీన్ని అర్థంచేసుకోవాలి. ‘స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. వీటిలో విజయం సాధించేందుకే ఇదంతా అని వ్యాఖ్యానించారు

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)