Breaking News

ఇండియా ఫస్ట్ సన్‌రైజ్‌.. నాగాలాండ్ మంత్రి వీడియో వైరల్‌..

Published on Thu, 09/14/2023 - 09:17

కోహిమా: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌ ఉండే నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్.. ఏదో ఒక కొత్త విషయంతో అభిమానుల ముందుకు వస్తుంటారు. కామెడీ, సందేశాత్మక, నాలెడ్జ్‌కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా భారత దేశంలో సూర్యోదయం మొదట అయ్యే దృగ్విషయాన్ని వీడియో రూపంలో పోస్టు చేశారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని డాంగ్ వ్యాలీని టెమ్‌జెన్ షేర్ చేశారు. అప్పుడే వెలుతురు వస్తుండగా.. అందమైన లోయ ప్రాంతాలు మనోహరంగా కనిపించాయి. మేఘాలు తాకుతున్న పర్వత శిఖరాల మధ్య నది పరవళ్లు, పచ్చని లోయ ప్రాంతాల్లో విహారాన్ని గుర్తు చేశారు. ఈశాన్య భారతం అందాలు సింపుల్‌గా ఒక్క వీడియోలో చూపించారు. గూగుల్‌ చేసి చూడండి అని ట్యాగ్‌ను జతచేసి వీడియోను పోస్టు చేశారు. భారత్‌లో మొదట సూర్యోదయం అయ్యే ప్రదేశంగా డాంగ్‌ లోయను చెప్పుకుంటారు. 

ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. నెటిజన్లు కామెంట్లతో నింపేశారు. ప్రస్తుతం ఈశాన్య భారతం ట్రిప్‌లోనే ఉన్నా.. చాలా అందమైన ప్రదేశం అని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా తప్పకుండా చూడాలని మరో యూజర్ స్పందించారు. దేశంలో సూర్యుడు మొదట ముద్దాడే డాంగ్ లోయను మీరూ చూసేయండి మరి..!  

ఇదీ చదవండి: పార్క్‌లో సరదాగా..

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)