Breaking News

సివిల్స్‌ ఫలితాల‍్లో ఇద్దరికి ఓకే ర్యాంకు.. తేల్చేసిన యూపీఎస్సీ?

Published on Fri, 05/26/2023 - 19:02

సివిల్ సర్వీస్‌ పరీక్ష ఫలితాలు ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. సివిల్‌ సర్వీసెస్‌ 2022 తుది ఫలితాల్లో మొత్తం 933 మంది అభ్యర్థులను యూపీఎస్‌సీ ఎంపిక చేంది. . వీరిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మంది ఉన్నారు. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌, గ్రూప్‌-Aకు 473 మంది, గ్రూప్‌-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్‌-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది.

కాగా యూపీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాక మధ్యప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులకు ఒకే ర్యాంక్‌ వచ్చింది. ముందుగా సివిల్స్‌కు ఎంపిక అవ్వడంతో అంతులేని ఆనందానికి లోనయ్యారు. తమ శ్రమ ఫలించిందనుకున్నారు. ఇంతలోనే తన పేరు, ర్యాంకు, రోల్‌ నంబర్లతో మరో అమ్మాయి ఉందని తెలియడంతో నిర్ఘాంతపోయారు. ఆ ర్యాంకు నాదంటే.. నాదంటూ యూపీఎస్సీకి తమ అడ్మిట్‌ కార్డులను సమర్పించారు. 

ఒకే పేరుతో ఇద్దరు
దేవాస్‌ జిల్లాకు చెందిన ఆయేషా ఫాతిమా (23), అలీరాజ్‌పూర్‌కు చెందిన ఆయేషా మక్రాని (26) ఇద్దరూ ఇటీవల వెల్లడించిన యూపీఎస్సీ ఫలితాల్లో అర్హత సాధించారు. వారిరువురికీ 184వ ర్యాంకు వచ్చింది. వీరిద్దరి రోల్‌ నంబర్లు కూడా ఒకటే. దీంతో అసలు సమస్య వచ్చిపడింది. ఆ ర్యాంకు నాదంటే.. నాదంటూ ఇద్దరూ యూపీఎస్సీకి తమ అడ్మిట్‌ కార్డులను సమర్పించారు.  స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదులు చేశారు.
చదవండి: చితికి చేరుతున్న చీతాలు.. ‘ప్రాజెక్ట్‌ చీతా’పై కొత్త కమిటీ

తేల్చేసిన యూపీఎస్సీ
వారిద్దరి అడ్మిట్‌ కార్డులను గమనిస్తే కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూ నిర్వహించిన తేదీ ఇక్కడ కీలకంగా మారింది. వీరిద్దరికీ ఏప్రిల్‌ 25, 2023న పర్సనాలిటీ టెస్టు నిర్వహించారు. అయితే.. మక్రానీ అడ్మిట్‌కార్డులో గురువారం ఉండగా.. ఫాతిమా కార్డులో మంగళవారం అని స్పస‍్టంగా ఉంది. క్యాలెండర్‌ ప్రకారం ఆ రోజు మంగళవారమే. అంతేకాకుండా ఫాతిమా అడ్మిట్‌కార్డులో యూపీఎస్సీ వాటర్‌ మార్కుతోపాటు క్యూఆర్‌ కోడ్‌ సైతం ఉంది. మక్రానీ అడ్మిట్‌కార్డుపై ఇవేం లేవు. దీంతో యూపీఎస్సీ అధికారులు ఫాతిమానే అసలు అభ్యర్థి అని పేర్కొన్నారు.

మరోచోట కూడా
మరోవైపు  తుషార్‌ అనే పేరుతోనూ ఇలాంటి సమస్యే ఎదురైంది. తమకు 44వ ర్యాంక్‌ వచ్చిందని హరియాణాకు చెందిన తుషార్‌, బిహార్‌కు చెందిన తుషార్‌ కుమార్‌ చెప్పారు. దీంతో దర్యాప్తు చేపట్టిన యూపీఎస్పీ.. బిహార్‌కు చెంది తుషార్‌ కుమార్‌ నిజమైన అభ్యర్థిగా గుర్తించింది. ఆయేషా మక్రాని (26)తో సహా బిహార్‌కు చెందిన తుషార్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు యూపీఎసీ పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షల్లో మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగబోవని హామీ ఇచ్చారు.
చదవండి: లండన్‌లో ఉద్యోగం వదిలేసి సివిల్స్‌ వైపు.. థర్డ్‌ అటెంప్ట్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌

Videos

శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం

పుష్ప రాజ్ తో కేజీఎఫ్ 2 భామ

పాకిస్తానీ నటితో చేయను: బాలీవుడ్ హీరో

ముగిసిన వీరజవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు

ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన సమావేశం

బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాక్ కు అడగండి

Ding Dong 2.O: సీఎంల జేబులు ఖాళీ

Miss World Competition: తారలు దిగివచ్చిన వేళ..!

పాక్ ను వణికించిన BRAHMOS

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన

Photos

+5

తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)

+5

డాక్టర్ బాబు నిరుపమ్‌ భార్య బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వైభవంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 11-18)

+5

మిస్ వరల్డ్ 2025 ఆరంభం: స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నందిని గుప్తా (ఫొటోలు)

+5

Miss World 2025 : ఘనంగా హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం (ఫొటోలు)

+5

సీరియల్ నటి విష్ణుప్రియ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)

+5

పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్‌ (ఫొటోలు)