Breaking News

అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం

Published on Tue, 01/28/2025 - 12:10

ప్రతిరోజూ అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టేవారు ఒకరోజు  ఒక రహస్య గుహను గమనించారు. వారు ఈ గుహ గురించి అందరికీ చెప్పగానే, అది స్థానికంగా సంచలంగా మారింది. ఆ కట్లెలు కొట్టేవారు ఆ గుహలోని వెళ్లి చూడగా, వారికి అక్కడ కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది.  

బీహార్‌లోని జముయి జిల్లాలోని బర్హత్ బ్లాక్ ప్రాంతంలో ఈ రహస్య గుహ వెలుగు చూసింది.  పంచకుల అడవిలో ఉన్న కొండలలో ఒక రహస్య గుహ ఉందని ఆ ప్రాంతానికి చెందిన కట్టెలు కొట్టేవారు చెప్పడంతో స్థానికులు ఆశ్చర్యపోతూ, ఆ గుహను చూసేందుకు తరలివస్తున్నారు. గుహ లోపల ఒక శివలింగం ఉందని, ధ్యాన స్థితిలో కూర్చున్న ఒక ఋషికి సంబంధించిన ఒక పురాతన విగ్రహం కూడా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ఆ గుహలోకి ప్రవేశించే మార్గం చాలా ఇరుకుగా ఉంది. అయినప్పటికీ కొందరు టార్చిలైట్లు చేతబట్టి, గుహలోనికి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు.

గ్రామానికి చెందిన హీరా మాంఝీ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని కొంతమంది కలప సేకరించడానికి అడవిలోకి వెళ్లినప్పుడు ఈ గుహను గమనించారని తెలిపారు. ఆ కట్టెలు కొట్టేవారిలోని ఒక వ్యక్తి సాహసం చేసి, గుహలోకి  వెళ్లాడని, అక్కడ అతనికి ఒక శివలింగం, ఒక ఋషి విగ్రహం కనిపించాయని తెలిపారు. ఈ గుహ జిల్లాలోని ప్రసిద్ధ కుకుర్జాప్ ఆనకట్టకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. గుహ పైన పెద్ద బండ రాళ్ళు ఉన్నాయి. ఈ గుహగురించి తెలిసిన అనంతరం స్థానికులు గుహ వెలుపల కూర్చుని భజనలు, పూజలు చేస్తున్నారు. భక్తులు దర్శించుకునేందుకు వీలుగా గుహలోనికి మార్గం ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. 

ఇది కూడా చదవండి: కుంభమేళా రైలుపై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)