Breaking News

కుమార్తెకు రైలు పేరు పెట్టిన మహిళ

Published on Tue, 06/11/2024 - 11:06

మహారాష్ట్రలో ఓ విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. నిండు గర్భిణిగా ఉన్న ఓ ముస్లిం మహిళ  ఊహించని రీతిలో రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇతర మహిళా ప్రయాణికులు ఆమెకు పురుడు పోశారు. రైలులో తనకు పుట్టిన బిడ్డకు ఆ తల్లి ఆ రైలు పేరునే పెట్టింది. ఇకపై తన బిడ్డను ఆ రైలు పేరుతోనే పిలుచుకుంటానని తెలిపింది.  

వివరాల్లోకి వెళితే జూన్ 6న ఉదయం కొల్హాపూర్-ముంబై మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న గర్భిణి ఫాతిమా ఖాతూన్ (31)కు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఆమె రైలు లోనావాలా స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో భర్త తయ్యబ్‌కు తెలిపింది. తయ్యబ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమాకు వాంతులు అవుతుండటంతో ఆమె రైలులోని టాయిలెట్‌కు వెళ్లింది. ఎంతసేపటికీ ఫాతిమా తిరిగి రాలేదు. దీంతో తయ్యబ్‌ టాయిలెట్‌లోనికి వెళ్లి చూశాడు. ఫాతిమా ఆడబిడ్డకు జన్మనిచ్చిందని గుర్తించాడు. రైలులో ఉన్న ఇతర మహిళా ప్రయాణికులు ఈ సంగతి తెలిపాడు. దీంతో వారు ఫాతిమాకు సహాయం అందించారు.

ఈ  విషయాన్ని తయ్యబ్ రైల్వే పోలీసులకు తెలియజేశాడు. రైలు లోనావాలా స్టేషన్‌కు చేరుకోగానే  అక్కడి రైల్వే సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తల్లీబిడ్డకు చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి కుదుటపడ్డాక వారిని వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.

ఈ సందర్భంగా తయ్యబ్ మీడియాతో మాట్లాడుతూ తన భార్య డెలివరీ తేదీ జూన్ 20 అని, అయితే ఇంతలోనే ఆమె రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. తమకు ఇప్పటికే ముగ్గురు కుమారులు ఉన్నారన్నారు. తాము ఆ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తిరుపతి నుంచి మహాలక్ష్మి ఆలయానికి వెళ్తున్న కొందరు ప్రయాణికులు తమ బిడ్డను చూసి ‘మహాలక్షి ఎక్స్‌ప్రెస్‌’లో లక్ష్మీదేవి జన్మించిందని అన్నారని తయ్యబ్‌ పేర్కొన్నాడు. ఈ మాట విన్న తన భార్య తమ బిడ్డకు ‘మహాలక్ష్మి’ అనే పేరు పెట్టిందని ఆయన తెలిపాడు. 

#

Tags : 1

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)