Breaking News

UCC: అర్ధరాత్రి హడావిడిగా భేటీ

Published on Wed, 06/28/2023 - 10:54

ఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ నోట ఉమ్మడి పౌరస్మృతి  ప్రస్తావన రావడంతో.. ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు అప్రమత్తమైంది. మంగళవారం అర్ధరాత్రి హడావిడిగా సమావేశమైంది. ఈ భేటీలో ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బోర్డు.. ఇందుకు సంబంధించిన ఓ కీలక నిర్ణయం సైతం తీసుకుంది. 

ముస్లిం లా బోర్డు ప్రెసిడెంట్‌ సైఫుల్లా రెహమానీ అధ్యక్షతన.. ఇస్లామిక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మౌలానా ఖలీద్‌ రషీద్‌ ఫరంగీ మహాలీ, ముస్లిం లా బోర్డు ఇతర సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. వర్చువల్‌గానే జరిగిన ఈ భేటీ  మూడు గంటలపాటు సాగినట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. భోపాల్‌ వేదికగా ప్రధాని చేసిన ప్రంసగంతో ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో మళ్లీ చర్చ ఊపందుకుంది. ఒక దేశానికి రెండు చట్టాలు కావాలా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూటిగానే ప్రశ్నించారు. ఒకే కుటుంబంలో ఉండే ఇద్దరు వ్యక్తులకి రెండు నిబంధనలు పెడితే దేశం ఎలా ముందుకు వెళుతుందని నిలదీశారు. ఇప్పటికే 22వ లా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు.. దేశ ప్రజలు, మత సంస్థల అభిప్రాయాలను 30 రోజుల్లోగా తీసుకోవాలని గడువు విధించారు.

ఈ నేపథ్యంలో.. వర్చువల్‌గానే ముస్లిం లాబోర్డు భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలనే ప్రధానాంశంగా చర్చించి..  యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను మరింత గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు లా కమిషన్‌కు ఓ డ్రాఫ్ట్‌ను సమర్పించేందుకు ముస్లిం బోర్డు సిద్ధమవుతోంది.

ఇదీ చదవండి: ఒకే దేశం.. ఒకే చట్టం సాధ్యమేనా!

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)